Ghulam Nabi Azad : జమ్మూ కాశ్మీర్ ప్రజలే పార్టీని నిర్ణయిస్తారు
మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ట్రబుల్ షూటర్ గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తరుణంలో ఆయన రాజీనామా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఇదే క్రమంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు తన పార్టీ పేరును, జెండాను నిర్ణయిస్తారని ప్రకటించారు ఆజాద్.
ఇదిలా ఉండగా జమ్మూ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా తన మద్దతుదారుల నుంచి ఆజావ్ వేదిక వద్దకు చేరుకున్నారు.
2005 నుంచి 2008 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) సీఎంగా పని చేశారు. ఆయన డోగ్రా తలపాగా ధరించారు. ఆదివారం జమ్మూ లోని సైనిక్ కాలనీలో బహిరంగ సభ నిర్వహించారు.
ఊహాగానాల మధ్య ఆజాద్ తన పార్టీ పేరును ఇంకా నిర్ణయించ లేదని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు పార్టీకి పేరు, జెండాను నిర్ణయిస్తారని వెల్లడించారు. పార్టీకి హిందూస్తానీ పేరును ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా పెడతానని చెప్పారు.
అంతకు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. నేను ఎప్పుడూ జమ్మూ కాశ్మీర్ ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం నేను సీఎంను కాను. మంత్రిని కాదు. నేను కేవలం ప్రజల మనిషిని. మీకు సంబంధించిన మనిషిని అని చెప్పారు గులాం నబీ ఆజాద్.
గత వారం రోజులుగా చాలా మంది కాంగ్రెస్ కు రాజీనామా చేసి నాకు మద్దతు ఇచ్చారని వెల్లడించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు.
Also Read : ప్రభుత్వం వ్యాపారాలు నిర్వహించొద్దు – భార్గవ