Jharkhand Trust Vote : జార్ఖండ్ సీఎం బల నిరూపణకు సిద్దం
సోమవారం ఖరారుకు ముహూర్తం
Jharkhand Trust Vote : జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం ఇంకా అలాగే కొనసాగుతోంది. తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో జీఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ ప్రమాదంలో పడింది.
దీంతో ముందుగా తేరుకున్న సీఎం హేమంత్ సోరేన్ ఎమ్మెల్యేలందరినీ మొదట గెస్ట్ హౌస్ కు తరలించారు. అక్కడి నుంచి రక్షణగా ఉండేందుకు గాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ కు తరలించారు.
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నా సీఎం హేమంత్ సోరేన్. ఇందులో భాగంగా తాను బలం ఉందని నిరూపించుకునేందుకు రెడీగా ఉన్నానని ప్రకటించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి సోమవారం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విశ్వాస పరీక్షకు సిద్దంగగా ఉన్నట్లు ప్రకటించారు.
దీని వల్ల ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగి పోతాయన్నారు. జార్ఖండ్ లోని(Jharkhand Trust Vote) అధికార సంకీర్ణ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య గత కొన్ని రోజులుగా ఉన్న రాయ్ పూర్ నుండి రాంచీకి తిరిగి ప్రయాణం అయ్యారు.
బీజేపీ ఆడుతున్న నాటకాలు, కుట్రలు పని చేయవని కుండ బద్దలు కొట్టారు సీఎం హేమంత్ సోరేన్. అయితే ఆయన ఆరు నెలల వరకు సీఎంగా ఉంటారు. అంతలోపు తన నిర్దోషిత్వాన్ని నిరూపించు కోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పే మీ లేదన్నారు. సంతల్లో పశువులను కొనుగోలు చేసినట్లు బీజేపీ నోట్ల కట్టలతో ఎర వేయాలని అనుకుంటోందని కానీ వారి ఆటలు సాగగవన్నారు సీఎం హేమంత్ సోరేన్.
Also Read : జమ్మూ కాశ్మీర్ ప్రజలే పార్టీని నిర్ణయిస్తారు