Liz Truss : ఇంధన ధరలు అదుపు చేస్తా – లిజ్ ట్రస్
యుకె ప్రధానమంత్రి రేసులో అభ్యర్థి
Liz Truss : యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) ప్రధానమంత్రిగా ఎవరు ఉండ బోతున్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరి దాకా వచ్చినా భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ ఒపీనియన్ పోల్స్ లో వెనుకబడ్డారు.
నాలుగు రౌండ్లలో టాప్ లో నిలిచినా ఎందుకనో చివరలో వెనుకంజలో ఉన్నారు. ఇక యుకె మీడియా మాత్రం విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ కే పీఎం అయ్యే చాన్స్ అధికంగా ఉందని పేర్కొంటున్నాయి.
ఈ తరుణంలో ఇవాల్టితో ప్రచారం ముగిసింది. సోమవారం ఎవరు గెలుస్తారనేది తేలనుంది. గతంలో పీఎంగా ఉన్న బోరిస్ జాన్సన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు.
కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఇద్దరూ బరిలో ఉండడం ఆసక్తిని రేపుతోంది. ఇదే సమయంలో పీఎం రేసులో ఎందరో బరిలో ఉన్నా చివరకు రిషి(Rishi Sunak), ట్రస్ మధ్య పోటీ నెలకొంది.
ఒకవేళ తాను గనుక ప్రధానమంత్రిగా ఎన్నికైతే మొదటి ప్రాధాన్యత ఏమిటో కూడా చెప్పారు లిజ్ ట్రస్. పెరుగుతున్న ఇంధన ధరలను తాను అదుపులోకి తీసుకు వస్తానని ఇదే మొదటి ప్రయారిటీ అని పేర్కొంది.
అంతే కాకుండా రెండంకెల ద్రోవ్యోల్బణంతో పోరాడుతున్న , ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
జీవన వ్యయ సంక్షోభం ప్రతి ఒక్కరికీ ఎంత సవాలుగా ఉందో తనకు అర్థమైందన్నారు. కుటుంబాలు, వ్యాపారాలు గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు లిజ్ ట్రస్(Liz Truss).
Also Read : ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు జారీ