Madhya Pradesh CM : పిల్లల ఆహారాన్ని బుక్కేశారు
మధ్యప్రదేశ్ లో భారీ స్కాం గుర్తింపు
Madhya Pradesh CM : మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న స్కీంలో భారీ అవినీతి బయటపడింది. బాలికలు, మహిళలకు ఉచితంగా ఆహారం అందిస్తున్న పథకంలో ఈ స్కాం చోటు చేసుకుంది.
అకౌంటెంట్ జనరల్ మోసం జరిగినట్లు గుర్తించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విభాగం గత 2020 నుండి మధ్యప్రదేశ్ సీఎం(Madhya Pradesh CM) శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలోనే ఉండడం విశేషం.
రేషన్ రవాణా ట్రక్కుల నుండి లబ్దిదారుల సంఖ్యను పెంచడం వరకు అవినీతి చోటు చేసుకుంది. పిల్లల కోసం అందిస్తున్న పోషకాహార కార్యక్రమంలో కళ్లు చెదిరే స్థాయిలో స్కాం చోటు చేసుకోవడం విస్తు పోయేలా చేసింది.
పోషకాహార లోపంతో ఉన్న వారే కాకుండా పన్ను చెల్లింపుదారులకు నష్టం కలిగించే ప్రమాదం. ఇందుకు సంబంధించి 36 పేజీల రహస్య నివేదికను సమర్పించారు.
పాఠశాల పిల్లలకు ప్రతిష్టాత్మకమైన ఉచిత ఆహార పథకం లబ్దిదారుల గుర్తింపు, ఉత్పత్తి, పంపిణీ , నాణ్యత నియంత్రణలో పెద్ద ఎత్తున మోసం, అక్రమాలను గుర్తించింది.
2021 కోసం టేక్ హోమ్ రేషన్ పథకానికి సంబంధించి 24 శాతం మంది లబ్ధిదారుల పరిశీలన ఆధారంగా దారుణమైన ఫలితాలు వచ్చాయి. 49.58 లక్షల మంది నమోదిత పిల్లలు, మహిళలకు పోషణను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
వీరిలో 6 నెలల నుండి 3 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 34.69 లక్షల మంది పిల్లలు, 14.25 లక్షల మంది గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 11-14 సంవత్సరాల మధ్య 0.64 లక్షల మంది కౌమార బాలికలు ఎఫెక్ట్ పడింది.
ప్రస్తుతం ఈ భారీ స్కాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉంది.
Also Read : మౌనంగా ఉంటే దేశాన్ని అమ్మేస్తారు