S Jai Shankar : ఓటు బ్యాంకు రాజకీయాలు చెల్లవు – జై శంకర్
విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయవు
S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చెల్లవని, భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయవన్నారు.
ఇజ్రాయెల్ తో తన సంబంధాన్ని మరించ పెంచు కోవచ్చని కొన్ని రాజకీయ కారణాల వల్ల అలా చేయలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. భారత దేశ చరిత్రలో ఇజ్రాయెల్ ను సందర్శించిన తొలి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అని చెప్పారు.
ఇది తమ దేశానికి ప్రయోజనకరంగా ఉండేదన్నారు. దేశం మొత్తానికి తెలుసని జై శంకర్(S Jai Shankar) అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను పక్కన పెట్టిన కాలం పోయిందన్నారు.
విదేశీ విధానాలపై ఆధిపత్యం చెలాయించే రోజులు పోయాయని చెప్పారు. ఇజ్రాయెల్ పై భారత్ ప్రస్తుత వైఖరి అందుకు నిదర్శనమన్నారు.
ఇజ్రాయిల్ పాలంటైన్ మధ్య వైరుధ్యం చాలా కాలంగా కొనసాగుతోందన్నారు. కొన్ని ఇబ్బందుల పరిస్థితుల వల్ల ఇజ్రాయిల్ తో తమ సంబంధాలను కొనసాగించ లేదన్నారు జై శంకర్(S Jai Shankar).
తమంతకు తాము పరిమితం చేసుకున్నామని చెప్పారు. బంధాల వల్ల మనం ప్రయోజనం పొందగలమని దేశం మొత్తానికి తెలుసన్నారు.
దేశ ప్రయోజనాలను శాసించే రోజులు పోయాయని పేర్కొన్నారు. జై శంకర్ ది ఇండియా వే – స్ట్రాటజీస్ ఫర్ యాన్ అనే పేరుతో పుస్తకం రాశారు.
గుజరాతీ అనువాదం పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. హాజరైన వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి.
Also Read : మెగసెసే అవార్డు నాకొద్దు – కేకే శైలజ