Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ
స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్
Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్ జై రాం రమేష్(Jairam Ramesh) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని అనడం వాస్తవం కాదన్నారు.
పూర్తిగా అబద్దమని పేర్కొన్నారు. తమ పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్య స్పూర్తి ఇంకే పార్టీలోనూ లేదన్నారు. తమపై విమర్శలు చేస్తున్న భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదన్నారు.
తమను కుటుంబ పార్టీ అని ఆరోపణలు చేస్తున్న వారిలో ముందు గుర్తించాల్సింది ఎక్కువ శాతం వారి పార్టీలో ఉన్నారని తెలుసు కోవాలన్నారు. అమిత్ షా , తనయుడు ఇద్దరూ పార్టీ పదవులు అనుభవిస్తున్నారని మరి ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు జై రాం రమేష్(Jairam Ramesh).
జోడో యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీకి ఢోకా లేదన్నారు. తమది అసలు సిసలైన ప్రజాస్వామ్య పార్టీ. మేం ఎవరి గొంతు నొక్కడం లేదన్నారు.
ఇది పూర్తిగా ఎవరైనా పోటీ చేయవచ్చు. ఇంకేమైనా ప్రశ్నించవచ్చని స్పష్టం చేశారు. రాచరిక వ్యవస్థను పోలి ఉన్నది బీజేపీ పార్టీ. సంతృప్తి చెందని వారు మాత్రమే పార్టీపై రాళ్లు వేస్తారని వారికి అంత సీన్ లేదన్నారు.
ఆయన గులాం నబీ ఆజాద్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేశారు. తాము త్వరితగతిన ప్రజలందరికీ చేరువయ్యేందుకు ప్రయత్నిస్తామన్నారు.
కొందరు మాత్రం పని గట్టుకుని తమపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అది వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామని పేర్కొన్నారు జై రాం రమేష్.
ప్రజలు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారని, చివరకు కాంగ్రెస్ పార్టీకి కట్టడం ఖాయమన్నారు జైరాం రమేష్.
Also Read : త్వరలో మోడల్ జైళ్ల చట్టం – అమిత్ షా