Priti Patel : హోం సెక్ర‌ట‌రీకి ప్రీతి ప‌టేల్ రాజీనామా

లిజ్ ట్ర‌స్ గెలిచిన కొన్ని గంట‌ల‌కే

Priti Patel :  పీఎం ప‌ద‌వి రేసులో చివ‌రి వ‌ర‌కు నిలిచి రిషి సున‌క్ పై లిజ్ ట్ర‌స్ గెలుపొందిన కొద్ది గంట‌ల‌కే కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. యుకె హోం సెక్ర‌ట‌రీగా ఉన్న ప్రీతి ప‌టేల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

దేశానికి కొత్త నాయ‌కురాలిగా కొలువు తీరిన లిజ్ ట్ర‌స్ ను అభినందించారు ప్రీతి ప‌టేల్(Priti Patel) . అన్ని విధాలుగా తాను మ‌ద్ద‌తు ఇస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా అత్యున్న‌త‌మైన ప‌ద‌విలో తాను ఇప్ప‌టి దాకా ఉన్నందుకు, సేవ‌లు అందించేలా త‌న‌కు అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

లిజ్ ట్ర‌స్ లో త‌ను పని చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. యుకె తాత్కాలిక ప్ర‌ధాన మంత్రిగా ఉన్న బోరిస్ జాన్స‌న్ కు ఈ మేర‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు లేఖ రాశారు.

లిజ్ ట్ర‌స్ అధికారికంగా బాధ్య‌త‌లు స్వీక‌రించి కొత్త హొం కార్య‌ద‌ర్శిని నియ‌మించిన త‌ర్వాత , బ్యాక్ బెంచ్ ల నుండి దేశానికి తాను సేవ‌లు అందిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు ప్రీతి ప‌టేల్(Priti Patel) .

ఇదిలా ఉండ‌గా గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా యుకె హోం కార్య‌ద‌ర్శిగా ఆమె దేశానికి సేవ‌లు అందించారు. పోలీసుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం, ఇమ్మిగ్రేష‌న్ వ్య‌వ‌స్థ‌ను సంస్క‌రించ‌డం , దేశాన్ని ర‌క్షించ‌డం వంటి వాటిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాన‌ని పేర్కొన్నారు.

విశిష్ట సేవ‌లు అందించినందుకు తాను గ‌ర్వ ప‌డుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. మీతో క‌లిసి ప‌ని చేయ‌డం గొప్ప గౌర‌వం, ప్ర‌త్యేక‌త అన్నారు ప్రీతి ప‌టేల్. 2019 జూలైలో మీరు పీఎంగా ఉన్న‌ప్పుడు నేను జాయిన్ అయ్యాను. మీతో క‌లిసి ప‌ని చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

Also Read : ఓటేసిన ప్ర‌తి ఒక్క‌రికి థ్యాంక్స్ – సున‌క్

Leave A Reply

Your Email Id will not be published!