Hijab Case : విశ్వాసం మంచిదే యూనిఫాం పాటించాల్సిందే
హిజాబ్ వివాదంపై పిటిషన్ పై విచారణ
Hijab Case : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది కర్ణాటకలోని హిజాబ్ నిషేధం వివాదం. సుప్రీంకోర్టు స్కూల్ యూనిఫాంకు సంబంధించి విచారణ చేపట్టింది.
రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో హిజాబ్ పై(Hijab Case) నిషేధాన్ని ఎత్తి వేసేందుకు నిరాకరించింది రాష్ట్ర హైకోర్టు. ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన దావాపై ధర్మాసనం వాదనలు విన్నది.
రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గత వారం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తికి మతాన్ని ఆచరించే హక్కు ఉంది.
అయితే దానిని నిర్దేశించిన యూనిఫాం ఉన్న పాఠశాలకు తీసుకెళ్లవచ్చా అనేదే ప్రశ్న. ఏ కులమైనా , ఏ మతమైనా లేదా ఏ జాతికి, ఏ వర్గానికి చెందిన వారైనా సరే తాము చదువుకునే బడి లేదా కాలేజీకి సంబంధించిన రూల్స్ పాటించాల్సిందే.
ఎవరికి తోచిన మేర వారు ఉంటామంటే కుదరదు. ప్రతి దానికి ఓ సిస్టం అంటూ ఉంటుంది. అది దారి తప్పితే ఇబ్బందులు ఎదురవుతాయి.
మీ విశ్వాసాలను వదులు కోమని చెప్పడం లేదు. అలాగని మీరు మాత్రమే వాస్తవమని నమ్మితే కుదరదు. మీకు సంబంధించి లేదా ఇంకెవరైనా సరే అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
మీరు ఏది ఆచరించాలని అనుకుంటున్నారో దానిని ఆచరించేందుకు మీకు మతపరమైన హక్కు ఉండవచ్చు.
కానీ మీరు ధరించ వలసిన దుస్తులలో భాగంగా యూనిఫాం ఉన్న పాఠశాలకు ఆ హక్కును ఆపాదించగలరా అది ప్రశ్నించడం అవుతుందన్నారు న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియా.
Also Read : ఆశిష్ మిశ్రా బెయిల్ పై సుప్రీం నోటీస్