Mahua Moitra : రాజ్ పథ్ పేరు మార్పుపై మహూవా ఫైర్
కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం
Mahua Moitra : మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ నిప్పులు చెరిగారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ మహూవా మోయిత్రా. రాజ్ పథ్ పేరు మార్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద పీఎం నివాసం ప్రస్తుతం ఉన్న సౌత్ బ్లాక్ వెనుకకు మార్చబడుతుంది. న్యూఢిల్లీ లోని ఐకానిక్ రాజ్ పథ్ కు కర్తవ్య మార్గంగా పేరు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై మహూవా మోయిత్రా(Mahua Moitra) ఆరోపించారు.
కిం కర్తవ్య వముద్ మఠ్ అని పేరు పెట్టాలని అనుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఎంపీ. ఇదిలా ఉండగా ఇండియా గేట్ సి – హెక్సాగాన్ వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం నుండి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న రహదారి ప్రాంతాన్ని కర్తవ్య మార్గంగా పిలుస్తారని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.
ఈ మార్గం వలస పాలనలో ఉత్సవ బౌలేవార్డ్ గా గతంలో పిలిచారు. కాగా లండన్ లో కింగ్స్ వే తరహాలో దీనిని రూపొందించారు. రాజ్ పథ్ పేరు మార్చడం వల్ల గతాన్ని తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా పరిగణించ బడతుందన్నారు.
వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబించే చిహ్నాల రద్దును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తన ఇటీవల చేసిన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించారు.
అయితే ప్రధాని నివాసానికి కింకర్తవ్య విముద్ మఠం అని పేరు పెడితే బావుంటుందని సూచించారు ఎంపీ మోయిత్రా.
Also Read : భారత్ గురించి ఎంత చెప్పినా తక్కువే