Sachin Pilot Gehlot : రాజస్థాన్ లో పైలట్ వర్సెస్ గెహ్లాట్
కాంగ్రెస్ లో ముదిరిన కుంపట్లాట
Sachin Pilot Gehlot : వచ్చే అక్టోబర్ 17న కీలకమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. అదే నెల 19న ఫలితం వెలువడనుంది. ఈ తరుణంలో ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలతో సతమతం అవుతోంది.
ఆధిపత్య పోరులో పార్టీకి తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఇక రాజస్థాన్ లో పైకి కనిపించక పోయినా సచిన్ పైలట్ వర్సెస్ అశోక్ గెహ్లాట్ మధ్య అంతరం పెరిగిందని చెప్పక తప్పదు.
జూలై 2020లో సచిన్ పైలట్ గెహ్లాట్(Sachin Pilot Gehlot) పై బహిరంగ విమర్శలు చేయడం పార్టీని ఒకరకంగా ఇబ్బందికి గురి చేసింది. ఒకరినొకరు కించ పరుచుకునేలా మాట్లాడ వద్దంటూ ఇప్పటికే హైకమాండ్ ఆదేశించింది.
ఇదిలా ఉండగా సచిన్ పైలట్ 45వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మద్దతు దారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాజస్థాన్ లో త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ కొత్త నేతను ఎంపిక చేసే పనిలో పడిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల తర్వాత ఒకరినొకరు విమర్శలు చేసుకోవద్దంటూ ఒప్పందానికి రావాలని ఇరు వర్గాల నేతలు అభిప్రాయపడ్డారు.
రాజస్థాన్ లోని దౌసాలో ఉన్న సచిన్ పైలట్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే కీలకం వారే బలం అని అన్నారు. మీరు లేక పోతే పార్టీ అంటూ ఉండదన్నారు.
రాబోయే ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు పైలట్(Sachin Pilot). ఎవరిపై ఆరోపణలు చేయకండి. ప్రత్యేకించి వ్యక్తిగత విమర్శలు కూడా.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ చీఫ్ పదవి రేసులో పైలట్ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : శశి థరూర్ షాకింగ్ కామెంట్స్