PM Modi Liz Truss : లిజ్ ట్ర‌స్ కు మోదీ అభినంద‌న‌

రిషి సున‌క్ పై ఘ‌న విజ‌యం

PM Modi Liz Truss : బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నికైన లిజ్ ట్ర‌స్ కు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ (PM Modi Liz Truss)

శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆమె సార‌థ్యంలో భార‌త్, బ్రిట‌న్ దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం బ‌లోపేతం అవుతుంద‌ని ఆకాంక్షించారు.

ప్ర‌ధాన మంత్రిగా నూత‌న‌గా ఎన్నిక‌య్యారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. గ‌త కొన్ని రోజులుగా బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రిగా ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఉత్కంఠకు సెప్టెంబర్ 5తో తెర ప‌డింది.

చివ‌రి వ‌ర‌కు నువ్వా నేనా అన్న రీతిలో పోరు సాగింది. విచిత్రం ఏమిటంటే భార‌తీయ మూలాలు క‌లిగిన రిషి సున‌క్ ప్ర‌ధాన మంత్రి గా ఎన్నిక‌వుతార‌ని అంతా అనుకున్నారు.

కానీ ఊహించ‌ని రీతిలో ఒపినీయ‌న్ పోల్స్ లో తెర పైకి వ‌చ్చారు లిజ్ ట్ర‌స్. ఆమె ప్ర‌స్తుతం బ్రిట‌న్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. పీఎం ఎన్నిక‌ల్లో భాగంగా జ‌రిగిన మొద‌టి నాలుగు రౌండ్ల‌లో రిషి సున‌క్ ఆధిక్యంలో కొన‌సాగారు.

అయితే ఒపినీయ‌న్ పోల్స్ వ‌చ్చే స‌రిక‌ల్లా వెనుకబ‌డి పోయారు. ఇదిలా ఉండ‌గా ఫైన‌ల్ ఓటింగ్ లో లిజ్ ట్ర‌స్ కు 81,326 ఓట్లు వ‌చ్చాయి. ఇక రిషి సున‌క్ కు 60,399 ఓట్లు పోల్ అయ్యాయి.

క‌న్జ‌ర్వేటివ్ స‌భ్యులంతా లిజ్ ట్ర‌స్ వైపు మొగ్గు చూపారు. ప్ర‌స్తుతం తాను ఎన్నికైతే మొద‌ట‌గా దేశాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న ధ‌ర‌లను నియంత్రించేందుకు కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు లిజ్ ట్ర‌స్.

త‌న‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌త్యేకంగా మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : ఓటేసిన ప్ర‌తి ఒక్క‌రికి థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!