Boris Johnson : లిజ్ ట్ర‌స్ కు స‌హ‌కారం అందిస్తా – జాన్స‌న్

బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రిగా రిషి సున‌క్ పై గెలుపు

Boris Johnson : బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న ప‌ద‌వి పోయేందుకు కార‌ణం రిషి సున‌క్ అంటూ గ‌తంలోనే నిప్పులు చెరిగారు. తెలివిగా పావులు క‌దిపారు.

ఆపై విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్ర‌స్ కు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెలిపాడు. బ్రిట‌న్ పీఎంకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో లిజ్ ట్ర‌స్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. కొత్త ప్ర‌ధానిగా కొలువు తీర‌నుంది.

ఈ సంద‌ర్భంగా బోరిస్ జాన్స‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. త‌న స్థానంలో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న లిజ్ ట్ర‌స్ కు అభినంద‌న‌లు. ప్ర‌త్యేకంగా కంగ్రాట్స్.

ఆమెపై అపార‌మైన న‌మ్మ‌కం ఉంచి గెలిపించినందుకు ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్. ఆమె ప‌రిపాలన‌కు తాను శ‌క్తి వంచ‌న లేకుండా స‌పోర్ట్ చేస్తాన‌ని, అన్ని వేళ‌లా అండ‌గా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు బోరిస్ జాన్స‌న్(Boris Johnson).

క‌రోనా కాలంలో వైఫ‌ల్యంతో పాటు ప‌లు స్కాంలు బోరిస్ జాన్స‌న్ త‌నంత‌కు తానుగా త‌ప్పుకునేలా చేశాయి. దీని వెనుక రిషి సున‌క్ ఉన్నార‌ని బ‌లంగా న‌మ్మారు.

విచిత్రం ఏమిటంటే ఎన్నిక‌ల్లో భాగంగా జ‌రిగిన నాలుగు రౌండ్ల‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు రిషి సున‌క్. ఆ త‌ర్వాత ఒపీనియ‌న్ పోల్స్ లో అనూహ్యంగా వెనుక‌బ‌డ్డారు.

81 వేల‌కు పైగా ట్ర‌స్ కు ఓట్లు వ‌స్తే 60 వేల‌కు పైగా రిషి సున‌క్ కు వ‌చ్చాయి. మొత్తంగా త‌న ఓట‌మి వెనుక ఎంద‌రో వెన్ను పోటు పొడిచారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప్ర‌వాస భార‌తీయుడైన రిషి సున‌క్.

Also Read : లిజ్ ట్ర‌స్ కు మోదీ అభినంద‌న‌

Leave A Reply

Your Email Id will not be published!