Nitish Kumar : ప్ర‌ధానమంత్రి ప‌ద‌వి రేసులో లేను

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కామెంట్స్

Nitish Kumar :  జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. విప‌క్షాల‌ను ఏకం చేసే ప‌నిలో ప‌డ్డారు. మిష‌న్ ఆప్ష‌న్ పేరుతో నితీశ్ కుమార్ రంగంలోకి దిగారు.

ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను క‌లిశారు. తాజాగా నితీశ్ కుమార్ సీపీఎం అగ్ర నాయ‌కుడు సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు. విప‌క్షాల‌ను ఏకం చేసే ప‌నిలో ఉన్నాన‌ని చెప్పారు. అయితే మీరే ప్ర‌ధాన మంత్రి అవుతార‌ని , రేసులో ఉన్నార‌ని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు కాద‌ని అన‌లేదు అవున‌ని చెప్ప‌లేదు.

ప్ర‌స్తుతం రాబోయే ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. నేను ఎప్పుడూ దేనిని కోరుకోలేద‌న్నారు. ప్ర‌ధానంగా పీఎం రేసులో తాను లేన‌ని మ‌రోసారి పేర్కొన్నారు.

నా దృష్టి అంతా విప‌క్షాల‌ను ఏకం చేయ‌డ‌మే. దాని ప‌నిలోనే నేను బిజీగా ఉన్నాన‌ని చెప్పారు. మిగ‌తా వాటి గురించి అంత‌గా ప‌ట్టించు కోవ‌డం లేద‌ని పేర్కొన్నారు నితీశ్ కుమార్. విప‌క్షాల‌ను ఏక‌తాటిపైకి తీసుకు రావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మన్నారు.

2024లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ప్ర‌త్యామ్నాయంగా మీరు పీఎం రేసులో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని దీనిపై మీ కామెంట్ ఏంటి అంటూ ప్ర‌శ్న‌కు పై విధంగా స‌మాధానం చెప్పారు నితీశ్ కుమార్(Nitish Kumar).

ఇదిలా ఉండ‌గా నితీశ్ కుమార్ హ‌స్తిన టూర్ బీజేపీలో క‌ల‌క‌లం రేపాయి.

Also Read : ట్ర‌బుల్ షూట‌ర్ ప్ర‌ధాని అవుతారా

Leave A Reply

Your Email Id will not be published!