Nitin Gadkari : వెనుకాల ఉన్నోళ్లు బెల్ట్ వ‌ద్ద‌నుకుంటారు

సైర‌స్ మిస్త్రీ మ‌ర‌ణంపై మంత్రి నితిన్ గ‌డ్క‌రీ

Nitin Gadkari :  కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గడ్క‌రీ షాకింగ్ కామెంట్స్ చేశారు. వెనుక సీటులో బెల్ట్ పెట్టుకోక పోవ‌డం వ‌ల్ల‌నే టాటా స‌న్స్ మాజీ చైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ చ‌ని పోయాడ‌ని పోలీసులు తేల్చారు ప్రాథ‌మిక నివేదిక‌లో. దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు గ‌డ్క‌రీ.

వెనుక సీట్లో కూర్చున్న వాళ్లంతా త‌మ‌కు బెల్ట్ పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని భావిస్తార‌ని పేర్కొన్నారు. 54 ఏళ్ల మిస్త్రీ అహ్మ‌దాబాద్ నుండి ముంబై కి వెళుతున్న కారు రోడ్డు డివైడ‌ర్ ను ఢీకొట్టింది.

కారులో వెనుక సీట్లో కూర్చున్నారు మిస్త్రీ. ఆయ‌న బెల్టు పెట్టుకోలేదు. ఉన్న‌ట్టుండి ప‌డి పోయాడు. అక్క‌డే స్పాట్ లో ప్రాణాలు విడిచాడు.

అంతే కాకుండా ఆయ‌న ప‌క్క‌నే వెనుక సీట్లో కూర్చున్న మ‌రో ప్ర‌యాణికుడు జ‌హంగీర్ పండోలే కూడా చ‌ని పోయాడు. అయితే కార్ల‌కు ఆరు ఎయిర్ బ్యాగ్ ల‌ను త‌ప్ప‌నిస‌రి చేసేందుకు త‌మ మంత్రిత్వ శాఖ ప్ర‌య‌త్నిస్తోంద‌ని నితిన్ గ‌డ్క‌రీ(Nitin Gadkari) చెప్పారు.

రోడ్డు భ‌ద్ర‌త‌పై ప‌లు ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్న నేప‌థ్యంలో రోడ్డు ప్ర‌మాదాల‌ను అరిక‌ట్టేందుకు చేసే ఏ ప్ర‌య‌త్న‌మైనా ప్ర‌జ‌ల స‌హ‌కారం లేకుండా ఫ‌లించ‌ద‌న్నారు.

చాలా మంది ముందు సీట్లో కూర్చున్న వారు మాత్ర‌మే బెల్టు ధ‌రించాల‌ని అనుకుంటారు. కానీ అది పూర్తిగా త‌ప్పు వెనుక సీట్లో కూర్చున్న వారు కూడా బెల్టులు త‌ప్పనిస‌రిగా ధ‌రించాల‌ని సూచించారు నిత‌న్ గ‌డ్క‌రీ.

అన్ని వాహ‌నాల‌కు ప్ర‌త్యేకించి కార్ల‌కు ఆరు ఎయిర్ బ్యాగ్ లు అమ‌ర్చేలా త‌ప్ప‌నిస‌రి చేస్తామ‌న్నారు గ‌డ్క‌రీ.

Also Read : మిస్త్రీ మ‌ర‌ణం టాటా ప్ర‌క‌టించని సంతాపం

Leave A Reply

Your Email Id will not be published!