Amit Shah : సహకార విధాన ముసాయిదా కోసం ప్యానల్
47 మందితో ఏర్పాటు చేశామన్న అమిత్ షా
Amit Shah : కేంద్ర హొం, సహకార శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక ప్రకటన చేశారు. సహకార విధాన ముసాయిదా కోసం 47 మంది సభ్యులతో కూడిన ప్యానల్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సహకార్ సే సమృద్ది దార్శనికతను సాకారం చేసేందుకు కొత్త జాతీయ సహకార విధానం రూపొందిస్తామని స్పష్టం చేశారు అమిత్ షా(Amit Shah) .
దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త విధానం ఎంతగానో దోహద పడుతుందన్నారు కేంద్ర మంత్రి. జాతీయ సహకార విధాన పత్రం రూపకల్పన కోసం జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మాజీ కేంద్ర కేబినెట్ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు నేతృత్వంలోని జాతీయ స్థాయి కమిటీలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి 47 మంది సభ్యులు ఉన్నారు.
ఇది సహకార రంగానికి చెందిన నిపుణులను కలిగి ఉంటుంది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక సహకార సంఘాల ప్రతినిధులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకార సంఘాల కార్యదర్శులు, రిజిస్ట్రార్లు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల అధికారులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు అమిత్ చంద్ర షా.
ప్రాథమిక అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల నుండి సమ్రగ విధానాన్ని కలిగి ఉండే జాతీయ సహకార విధానాన్ని త్వరలో తయారు చేయనున్నట్లు కేంద్ర హొం మంత్రి ప్రకటించారు.
భారత దేశంలో 29 కోట్ల మంది సభ్యులతో 8.5 లక్షల సహకార సంఘాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read : దేశంలో ప్రశ్నించడం నేరం – సెతల్వాద్