Umesh Katti : కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి కన్నుమూత
తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన సీఎం బొమ్మై
Umesh Katti : భారతీయ జనతా పార్టీకి తీరని లోటు. కర్ణాటక రాష్ట్ర మంత్రి ఉమేష్ కత్తి(Umesh Katti) గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 61 ఏళ్లు. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఆయనకు ఉమేష్ కత్తితో ఎనలేని బంధం ఉంది. ఒక రకంగా ఉమేష్ కత్తిని సోదరుడిగా పిలుచుకుంటారు. తన తమ్ముడు ఇక లేడంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.
మంత్రికి మంగళవారం సడెన్ గా గుండె పోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. అప్పటికే ఆయన చని పోయినట్లు వైద్యులు గుర్తించారు.
ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో అటవీ, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పలు కీలకమైన శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి.
బెంగళూరులోని డాలర్స్ కాలనీ ఇంట్లో ఉండగా నొప్పితో కుప్ప కూలాడు. అనంతరం రామయ్య ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర అభివృద్దిలో ఉమేష్ కత్తి ఎనలేని కృషి చేశాడని కొనియాడారు సహచర మంత్రులు.
ఒక రకంగా నాకు అత్యంత ఆత్మీయుడు. ప్రత్యేకించి సోదరుడు కూడా. అంతలా నాతో కనెక్ట్ అయి ఉన్నాడు ఉమేష్ కత్తి(Umesh Katti).
కొన్ని జబ్బులతో బాధ పడుతున్నాడని తెలుసు కానీ ఇంత త్వరగా వెళ్లి పోతాడని కలలో కూడా అనుకోలేదన్నారు సీఎం బస్వరాజ్ బొమ్మై. ఒక రకంగా నాకే కాదు రాష్ట్రానికి పెద్ద నష్టమని, భారీ శూన్యతను మిగిల్చి వెళ్లాడంటూ వాపోయాడు.
మంత్రి మృతికి సంతాప సూచకంగా ప్రభుత్వం పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
Also Read : శశి థరూర్ షాకింగ్ కామెంట్స్