Bharat Jodo Yatra : మెగా కాంగ్రెస్ యాత్రకు శ్రీకారం
ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra : రాబోయే 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం భారీగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మెగా కాంగ్రెస్ యాత్రకు శ్రీకారం చుట్టింది. బుధవారం ఆ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ప్రారంభించనున్నారు.
150 రోజుల భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు కన్యాకుమారిలో ర్యాలీతో ప్రారంభించనున్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత ఈ యాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ యాత్ర తనకు తపస్సు లాంటిదని చెప్పారు రాహుల్ గాంధీ. ఇదిలా ఉండగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మాస్టర్ స్ట్రోక్ గా భావిస్తోంది.
తమిళనాడు లోని శ్రీ పెరంబదూర్ లోని తన తండ్రి , మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ స్మారకాన్ని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఉదయం సందర్శించుకున్నారు.
ఆయనకు నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ మండపంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్యాకుమారికి వెళ్లనున్నారు. అక్కడ సీఎం ఎంకే స్టాలిన్ యాత్ర ప్రారంభోత్సవం కోసం ఖాదీ జాతీయ జెండాను అందజేస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.
3,500 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర చేపట్టనుంది పార్టీ. రాబోయే 150 రోజులలో 12 రాష్ట్రాలు , రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ యాత్ర జరగనుంది. ప్రతి రోజు ఆరు లేదా ఏడు గంటల పాటు నడవనున్నారు.
ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఈ యాత్రను కవర్ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశాన్ని ఏకం చేసేందుకే ఈ యాత్రను చేపట్టడం జరిగిందన్నారు రాహుల్ గాంధీ.
Also Read : సహకార విధాన ముసాయిదా కోసం ప్యానల్