New Nasal Vaccine : కొత్త రకం వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్
ఇక నుంచి ముక్కు ద్వారా వ్యాక్సిన్
New Nasal Vaccine : భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ది చేసిన కొత్త రకపు వ్యాక్సిన్ కు పచ్చ జెండా ఊపింది కేంద్ర ప్రభుత్వం. కరోనాకు వ్యతిరేకంగా దీనిని తయారు చేసింది. గతంలో శరీరానికి సూదీల ద్వారా ఇచ్చే వారు .
కానీ ఇన్ కోవాక్ వ్యాక్సిన్ ను పూర్తిగా ముక్కు ద్వారా ఇచ్చేలా రూపొందించింది. ఇందుకు సంబంధించి అనుమతి కోసం భారత్ బయోటెక్ కంపెనీ భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదించింది.
ఇది కోవిడ్ -19కి వ్యతిరేకంఆ భారతదేశం రూపొందించిన మొదటి ఇంట్రా నాసల్ వ్యాక్సిన్(New Nasal Vaccine) కావడం విశేషం. ఇన్ కోవాక్ వ్యాక్సిన్ 18 ఏళ్లు పైబడిన పెద్దలలో రోగ నిరోధక శక్తిగా పని చేస్తుంది.
ఇది అత్యవసర పరిస్థితులలో మాత్రమే పరిమితం చేయబడిన ఉపయోగం కోసం ఉద్దేశించబడింది. ప్రస్తుతానికి ఇది వ్యాధి నిరోధకత లేని వారికి మాత్రమే ఇవ్వబడుతుంది.
ఇన్ కోవాక్ 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంటుంది. సులభంగా నిల్వ చేసేందుకు, పంపిణీ చేసేందుకు సపోర్ట్ చేస్తుంది. ఇదిలా ఉండగా భారత దేశం అంతటా వ్యాక్సిన్ కోసం భారీ తయారీ సామర్థ్యాలను ఏర్పాటు చేసినట్లు భారత్ బయోటెక్ కంపెనీ తెలిపింది.
ఇది సామూహిక నిరోధకతను ఎనేబుల్ చేస్తుందని తెలిపింది. పూర్తిగా ముక్కు ద్వారా చుక్కల మందు వేయనున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైనది.
మరింత పెరిగిన రోగాన్ని నయం చేసేందుకు ఉపయోగ పడుతుందని భారత్ బయోటెక్ పేర్కొంది. దీని ధర కూడా తక్కువే. మధ్య, పేదరికంతో ఉన్న దేశాలకు మేలు చేకూరనుంది.
Also Read : యుకె హొం సెక్రటరీగా ఎన్నారై సువెల్లా