IT Raids CPR : సెంటర్ ఫర్ రీసెర్చ్ పాలసీలో ఐటీ దాడులు
థింక్ ట్యాంక్ గా ప్రసిద్ది చెందిన సంస్థ
IT Raids CPR : ఇది ఊహించని పరిణామం. ఢిల్లీ థింక్ ట్యాంక్ గా పేరొందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో ఆదాయపు పన్ను దాడులు చేపట్టింది. రాజకీయ పార్టీల నిధులతో ముడిపడి ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ సంస్థ పాలక మండలికి అధ్యక్షత వహించిన మీనాక్షి గోపినాథ్, జేఎన్ యూలో బోధించిన రాజకీయ శాస్త్రవేత్త. అంతే కాకుండా లేడీ శ్రీరాం కాలేజీకి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు.
బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు గుర్తింపు పొందని 2,100కు పైగా ఉన్న రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో విరాళాల రూపేణా అందాయని స్పష్టం చేసింది.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఆదాయ పన్ను శాఖ రంగంలోకి దిగింది. విస్తృతంగా దేశ వ్యాప్తంగా ఉన్న గుర్తింపునకు నోచుకోని పార్టీల కార్యాలయాలపై సోదాలు చేపట్టింది.
ఇదే సమయంలో దేశంలోనే పేరొందింది సెంటర్ ఫర్ రీసెర్చ్ పాలసీలో సీబీఐ దాడులకు పాల్పడడం కలకలం రేపింది. ప్రధానంగా ఢిల్లీ లోని చాణక్య పురిలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఆఫీసులో సోదాలు చేస్తున్నారు.
హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ తో పాటు ఇతర ప్రదేశాలలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా సెంటర్ ఫర్ రీసెర్చ్ పాలసీ (IT Raids CPR) నుండి ఇప్పటి వరకు ఈ దాడులకు సంబంధించి ఎలాంటి స్పందన రాలేదు.
ఒకప్పుడు విద్యా వేత్త ప్రతాప్ భాను మెహతా సీపీఆర్ కు నేతృత్వం వహించారు. ప్రస్తుతం మీనాక్షి గోపీనాథ్ ఉన్నానరు. 1973లో దీనిని ఏర్పాటు చేశారు. ఇది స్వతంత్ర సంస్థగా పేరొందింది.
Also Read : పాఠశాలల అప్ గ్రేడ్ కు కేంద్రం ఆమోదం