Volker Turk : యుఎన్ మానవ హక్కుల చీఫ్గా టర్క్
అండర్ సెక్రటరీ జనరల్ గా జాబ్
Volker Turk : ఆస్ట్రియాకు చెందిన వోల్కర్ టర్క్(Volker Turk) తదుపరి యుఎన్ మానవ హక్కుల చీఫ్గా కానున్నారు. ప్రస్తుతం ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కార్యాలయంలో పాలసీకి అండర్ సెక్రటరీ జనరల్ గా పని చేస్తున్నారు.
రాబోయే కాలంలో తదుపరి హై కమీషనర్ గా కానున్నారు. ఈ విషయాన్ని రాయిటర్స్ నివేదించింది. సాంప్రదాయకంగా యుఎన్ చీఫ్ హైకమిషనర్ ని ఎంపిక చేసే ముందు యుఎన్ భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన చైనా , ఫ్రాన్స్ , స్యా , యునైటెడ్ కింగ్ డమ్ , యునైటెడ్ స్టేట్స్ తో సంప్రదింపులు జరుపుతారు.
అయినప్పటికీ ఈ నిర్ణయం గురించి భద్రతా మండలికి తెలియ చేసిందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. ఆగస్టు 31న పదవీ కాలం ముగిసిన చిలీకి చెందిన మిచెల్ బాచ్ లెట్ తర్వాత వోల్కర్ టర్క్(Volker Turk) బాధ్యతలు స్వీకరిస్తారు.
ఇదిలా ఉండగా వోల్కర్ టర్క్ నియామకానికి న్యూయార్క్ లోని యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదం పొందాలి. ధృవీకరించబడితే వోల్కర్ టర్క్స్ చైనా జిన్ జియాంగ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఇదే పోస్టు కోసం ఇతర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అర్జెంటీనా నుండి కెరీర్ డిప్లామాట్ ఫెడెరికో విల్లెగాస్ , సెనగల్ కు చెందిన అడమా డియెంగ్ నిలిచారు.
ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణపై ఐక్య రాజ్య సమితి ఫోకస్ పెడుతుంది. ప్రస్తుతం వోకర్ టర్క్ తదుపరి చీఫ్ గా ఎంపికయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
Also Read : ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ జూహీ కోర్ నోట్ వైరల్