Dalai Lama : తవాంగ్‌ని సంద‌ర్శించాల‌ని ఉంది – ద‌లైలామా

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఆధ్యాత్మిక గురు

Dalai Lama : ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆధ్యాత్మిక గురు ద‌లైలామా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని త‌వాంగ్ ని తాను సంద‌ర్శించాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.

ఇదిలా ఉండ‌గా మెక్ మోహ‌న్ రేఖ‌కు దక్షిణంగా ఉన్న త‌వాంగ్ ను సంద‌ర్శించ‌డాన్ని చైనా అభ్యంత‌రం తెలిపే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉండగా ద‌లైలామా 1983 నుండి ఈ ప్రాంతాన్ని ఏడుసార్లు సంద‌ర్శించారు.

ల్యాండ్ ఆఫ్ మోన్ పీపుల్ అని పేరుంది తవాంగ్ కు. భార‌త దేశంలో అతి పెద్ద బౌద్ద విహారాన్ని క‌లిగి ఉంది. ఇది టిబెట‌న్ బౌద్ద సంప్ర‌దాయంలోని గెలుగ్బా విభాగానికి చెందినది.

ఇది ద‌లైలామా సంస్థ‌కు సంబంధించిన పాఠ‌శాల‌. త‌న నెల రోజుల ల‌డ‌ఖ్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ప్ర‌త్యేకంగా త‌వాంగ్ ను సంద‌ర్శించాల‌ని అనుకుంటున్న‌ట్లు గురువారం స్ప‌ష్టం చేశారు ద‌లైలామా(Dalai Lama).

ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు హిమాల‌య ప్రాంత ప్ర‌జ‌ల‌తో బ‌ల‌మైన అనుబంధం ఉంద‌న్నారు.

ఇటీవ‌ల ల‌డ‌ఖ్ లో ఉన్నా. త్వ‌ర‌లో మ‌ళ్లీ మోన్ త‌వాంగ్ ను సంద‌ర్శిస్తాన‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు ద‌లైలామా. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు 87 ఏళ్లు ఉన్నాయి.

మెక్లీడ్ గంజ్ లో త‌న సుదీర్ఘ జీవితం కోసం ఐదు టిబెట‌న్ సంస్థ‌లు చేసిన ప్రార్థ‌న‌ల్లో ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మొత్తంగా చైనా ద‌లైలామాను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా కంట్రోల్ కావ‌డం లేదు.

ఇదే స‌మ‌యంలో భార‌త దేశం ఆధ్యాత్మిక నాయ‌కుడికి మ‌ద్ద‌తు ప‌లుకుతోంది. టిబెట‌న్లు భ‌క్తిలో ఎన్న‌డూ వెనుకంజ వేయ‌రు. కానీ వారు అణచివేత ప‌రిస్థితుల్లో జీవిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ద‌లైలామా.

Also Read : హుస్సేన్ సాగ‌ర్ కాద‌ది వినాయ‌క్ సాగ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!