Nitin Gadkari : ఆ డివైజ్ లు అమ్మొద్ద‌ని కేంద్రం ఆదేశం

అమెజాన్ కు బిగ్ షాక్ ఇచ్చిన ప్ర‌భుత్వం

Nitin Gadkari :  కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ కు(Amezon) కోలుకోలేని షాక్ త‌గిలింది. కార్ల‌లో సీట్ బెల్ట్ అలారం రాకుండా ఉండేలా రూపొందించిన ప‌రికరాల‌ను వెంట‌నే నిలిపి వేయాలంటూ నోటీసులు జారీ చేసింది.

ఈ విష‌యానికి సంబంధించి కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు కేంద్ర ఉప‌రిత‌ల‌, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీ(Nitin Gadkari). తాజాగా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, టాటా స‌న్స్ మాజీ చైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ అహ్మ‌దాబాద్ నుంచి ముంబై కి వ‌స్తుండ‌గా కారు డివైడ‌ర్ ను ఢీకొట్టింది.

దీంతో ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న‌తో పాటు మ‌రొక‌రు మృతి చెందారు. త‌ను వెనుక సీటులో ఉన్నా బెల్టు పెట్టుకోక పోవ‌డం వ‌ల్లే దుర్మ‌ర‌ణం చెందారంటూ ప్రాథ‌మిక నివేదిక‌లో పోలీసులు వెల్ల‌డించారు.

ఇదే విష‌యంపై తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి. ప్ర‌తి ఒక్క‌రు వెనుక సీటులో కూర్చున్న వారు త‌ప్ప‌నిస‌రిగా బెల్ట్ ధ‌రించాల‌ని కోరారు. కానీ కోట్లాది మంది బెల్టులు ధ‌రించ‌డాన్ని నామోషీగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ త‌రుణంలో దీనిని నివారించేందుకు వీటిని విక్ర‌యించ కూడ‌ద‌ని ప్ర‌భుత్వం అమెజాన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో రోడ్డు భ‌ద్ర‌తా నియ‌మాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇదిలా ఉండ‌గా కారు న‌డుపుతున్న స‌మ‌యంలో సీటు బెల్టులు ఉప‌యోగించని స‌మ‌యంలో అలార‌మ్ వ‌స్తుంద‌న్నారు. అయితే అలార‌మ్ రాకుండా ఉండేందుకు అమెజాన్ లో అందుబాటులో ఉన్న మెట‌ల్ క్లిప్ ల‌ను వినియోగిస్తున్నార‌ని తెలిపారు.

 

Also Read : మోదీ నిర్ణ‌యం ప్ర‌శంస‌నీయం – నిర్మ‌లా

Leave A Reply

Your Email Id will not be published!