Bipin Rawat : సైనిక శిబిరానికి బిపిన్ రావ‌త్ పేరు

జాతి గ‌ర్వించ ద‌గిన సైనిక యోధుడు

Bipin Rawat :  ఈ దేశం గ‌ర్వించేలా విధులు నిర్వ‌హించి భార‌త ర‌క్ష‌ణ రంగానికి ఎన‌లేని పేరు ప్ర‌తిష్ట‌లు తీసుకు వ‌చ్చి , అర్దంతారంగా రాలి పోయిన బిపిన్ రావ‌త్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది.

ఆయ‌న‌కు నివాళిగా అరుణాచ‌ల్ సైనిక శిబిరానికి బిపిన్ రావ‌త్(Bipin Rawat) పేరు పెట్టారు. స్థానిక సాంప్ర‌దాయ నిర్మాణ శైలిలో నిర్మించిన గేట్ ను అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బిడి మిశ్రా ప్రారంభించారు.

రాష్ట్రంలోని భార‌త సైన్యానికి చెందిన కిబితు సైనిక స్థావ‌రానికి మొద‌టి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్ ) జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ పేరు పెట్టారు. ఈ శిబిరంలో క‌ల్న‌ల్ గా త‌న యూనిట్ 5/11 గూర్ఖా రైఫిల్స్ కు నాయ‌క‌త్వం వ‌హించారు ఆయ‌న‌.

ఈ సంద‌ర్భంగా జ‌న‌ర‌ల్ రావ‌త్ గౌర‌వార్థం సైనిక స్టేష‌న్ పేరు మార్చే కార్య‌క్ర‌మం శ‌నివారం జ‌రిగిన‌ట్లు జాతీయ మీడియా సంస్థ వెల్ల‌డించింది.

గేట్ తో పాటు వాలాంగ్ నుండి కిబితు వ‌ర‌కు 22 కిలోమీట‌ర్ల ర‌హ‌దారిని కూడా అరణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం పెమా ఖండూ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మార్చ్ గా అంకితం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆర్మీ అధికారులు మాట్లాడారు. జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్(Bipin Rawat) గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న త‌ర‌త‌రాల పాటు గుర్తు పెట్టు కోద‌గిన అరుదైన సైనిక నాయ‌కుడు అని కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో దివంగ‌త సీడీఎస్ రావ‌త్ కుమార్తెల‌తో పాటు సీనియ‌ర్ సైనిక‌, పౌర ప్ర‌ముఖులు కూడా పాల్గొన్నారు. బిపిన్ రావ‌త్ ధైర్యం, శౌర్యం , దేశ‌భ‌క్తికి నా నివాళులు అని పేర్కొన్నారు సీఎం .

Also Read : యుకె కింగ్ గా కొలువు తీరిన చార్లెస్

Leave A Reply

Your Email Id will not be published!