Ghulam Nabi Azad : నాలుగు రెట్ల మద్దతు లభిస్తోంది – ఆజాద్
త్వరలోనే కొత్త పార్టీ ప్రకటిస్తానన్న నేత
Ghulam Nabi Azad : ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాక జోరు పెంచారు. మరింత హుషారుతో ఆయన జమ్మూ కాశ్మీర్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ప్రధానంగా రాహుల్ గాంధీని(Rahul Gandhi) టార్గెట్ చేశారు. ఆపై దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీని పల్లెత్తు మాట అనలేదు. కానీ సోనియా గాంధీని ప్రశంసించారు.
ఆమె చేతిలో పార్టీ లేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ ఉన్నంత వరకు భవిష్యత్తు అంటూ ఉండదని జోష్యం చెప్పారు. త్వరలోనే తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
తాను ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీలోని సీనియర్లు, నాయకులు, కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని చెప్పారు ఆజాద్.
అంతే కాదు కాంగ్రెస తనపై మిస్సైళ్లను ప్రయోగించిందని కానీ తాను రైఫిల్ తో వాటిని నాశనం చేశానని చెప్పారు. జమ్మూలో వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు.
మరింత జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాను పెట్టబోయే పార్టీ పేరు, జెండా, ఎజెండాను తాను నిర్ణయించడం లేదన్నారు. వాటన్నింటినీ జమ్మూ కాశ్మీర్ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad).
రోజు రోజుకు అనూహ్యమైన మద్దతు లభిస్తోందని చెప్పారు. 73 ఏళ్ల వయస్సు కలిగిన ఆజాద్ 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు.
శనివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. జమ్మూ లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల వారితో కలిశానని చెప్పారు.
Also Read : విదేశీ టీ షర్ట్ తో రాహుల్ పాదయాత్ర