Keshav Prasad Maurya : అఖిలేష్ యాద‌వ్ పై మౌర్య ఫైర్

ఆయ‌న ఆరోప‌ణ‌ల్లో నిజం లేదు

Keshav Prasad Maurya :  యూపీ డిప్యూటీ సీఎం, ఓబీసీ నాయ‌కుడిగా పేరొందిన కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య(Keshav Prasad Maurya) తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ పై గుర్రుమ‌న్నారు.

ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎస్పీ చీఫ్ కు అల‌వాటుగా మారింద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఓబీసీల‌కు బీజేపీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింద‌ని అఖిలేష్ ఆరోపించారు.

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఓబీసీల ఓటు బ్యాంకు అధికంగా ఉన్న‌ప్ప‌టికీ దామాషా ప్రాతిప‌దిక‌న సీఎం ప‌ద‌వి రావాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. కానీ బీజేపీ కేవ‌లం మాట‌ల వ‌ర‌కే చెబుతుంద‌ని ఆచ‌ర‌ణ‌లో ఉన్న‌త వ‌ర్గాల‌కే పెద్ద పీట వేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఓబీసీలు మొత్తం త‌మ పార్టీ వైపు ఉన్నారంటూ స్ప‌ష్టం చేశారు అఖిలేష్ యాద‌వ్. ఆయ‌న చేసిన కామెంట్స్ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపాయి. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య‌.

ప్ర‌స్తుతం అఖిలేష్ యాద‌వ్ కు ప‌ని లేకుండా పోయింద‌న్నారు. ఆయ‌న‌కు అధికార పార్టీని విమ‌ర్శించ‌డం త‌ప్ప మ‌రోటి లేద‌న్నారు. యోగి ప్ర‌భుత్వంలో ఓబీసీల‌కు త‌గిన ప్రాధాన్య‌త క‌ల్పించినా లేని పోని విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోవాల‌న్నారు కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య‌(Keshav Prasad Maurya).

ఇదిలా ఉండ‌గా డిప్యూటీ సీఎంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా తీవ్ర దుమారానికి దారి తీశాయి.

విచిత్రం ఏమిటంటే అధికార బీజేపీతో పాటు బీఎస్పీ చీఫ్ మాయావ‌తి కూడా చేర‌డం విశేషం. ప‌ద‌విని కోల్పోయిన ఫ్ర‌స్టేష‌న్ లో కామెంట్స్ చేస్తున్నారంటూ ఆరోపించారు.

Also Read : ఎంపీల లేఖ‌తో కాంగ్రెస్ లో క‌ద‌లిక

Leave A Reply

Your Email Id will not be published!