Covid19 : పెరిగిన కరోనా కేసులతో పరేషాన్
24 గంటల్లో 5,076 కేసులు నమోదు
Covid19 : కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. పలు దేశాలు ఇంకా కఠిన నియమ నిబంధనలు అమలు చేస్తున్నాయి.
గత కొంత కాలం నుంచీ భారత దేశంలో కరోనా కేసులు(Covid19) తగ్గుముఖం పట్టినా ఆ తర్వాత పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 5,076 కొత్త కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.
యాక్టివ్ కేసులు 47,945కి తగ్గాయి. కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం కీలక ప్రకటన చేసింది. కరోనా కేసులకు సంబంధించి వివరాలు వెల్లడించింది.
రోజూ వారీ సానుకూలత రేటు 1.58 శాతంగా ఉందని పేర్కొంది. వారపు అనుకూలత రేటు 1.72 శాతంగా నమోదైంది. ఇక వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,39,19,264కి పెరిగింది.
అయితే కేసుల మరణాల రేటు 1.19 శాతంగా నమోదైనట్లు తెలిపింది కేంద్ర మంత్రిత్వ శాఖ. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,44,95,359 కి చేరింది.
క్రియాశీల కేసులు 47,945కి తగ్గినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. తాజాగా 11 మంది కరోనా కారణంగా చని పోయారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 5, 28,150కి చేరుకుంది.
ఇందులో కేరళలలో కరోనా కారణంగా నలుగురు చనిపోయారు. ఇక మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.11 శాతం ఉండగా జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.71 శాతానికి పెరిగిందని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇక మంత్రిత్వ శాఖ ప్రకారం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 214.95 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు.
Also Read : రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇక లేరు