Delhi LG : ఢిల్లీ సర్కార్ బస్సుల కొనుగోలుపై విచారణ
ఆదేశించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా
Delhi LG : ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ సర్కార్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య ఆధిపత్య పోరు ఇంకా చల్లారలేదు. ఒకరిపై మరొకరు నిప్పులు చెరుగుతూ ఆరోపణలు చేసుకుంటున్నారు.
తానేమిటో తన పవర్ ఏమిటో చూపిస్తున్నారు లెప్టినెంట్ గవర్నర్(Delhi LG) . ఇప్పటికే మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందంటూ నిలిపి వేయాలని ఆదేశించారు సక్సేనా. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది.
ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ కుమార్ సిసోడియాతో పాటు 14 మంది ఉన్నతాధికారులపై అభియోగాలు మోపింది. ఏకంగా సిసోడియా నివాసంలో 14 గంటల పాటు సోదాలు చేపట్టింది.
ఆయన మొబైల్ , కంప్యూటర్లను స్వాధీనం చేసుకుంది. తాజాగా మరో షాక్ ఇచ్చారు ఎల్జీ సక్సేనా(Delhi LG). ఢిల్లీ ఆప్ ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేసింది.
ఇందుకు సంబంధించి విచారణ చేపట్టాల్సిందిగా ఎల్జీ ఆదేశించారు. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ద్వారా 1,000 లోఫ్లోర్ బస్సులను కొనుగోలు చేయడంపై ఇన్వెస్టిగేషన్ జరిపేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్టూ ఎల్జీ ఆదేశాలు జారీ చేసినట్లు రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు.
దీనిపై సీరియస్ గా స్పందించింది ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్. ఇది పూర్తిగా ఎల్జీ నిర్ణయం రాజకీయ ప్రేరేపితమంటూ ఆరోపించింది. చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ సూచన మేరకు కేసును దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ నిర్నయం తీసుకున్నారు.
బస్సుల టెండర్లు, కొనుగోలుకు సంబంధించిన కమిటీకి చైర్మన్ గా ఢిల్లీ రవాణా మంత్రిని నియమించారు కేజ్రీవాల్(Arvind Kejriwal). ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ నియామకంలో అవినీతి చోటు చేసుకుందని జూన్ లో ఫిర్యాదు అందింది.
Also Read : అభిషేక్ బెనర్జీ కోడలికి సమన్లు