UP CM : ల‌క్నో ఘ‌ట‌న‌లో 15 మంది అధికారుల‌పై వేటు

న‌లుగురు రిటైర్డ్ అధికారుల‌పై కూడా చ‌ర్య‌లు

UP CM :  బుల్డోజ‌ర్ బాబాగా పేరొందిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(UP CM ) దూకుడు పెంచారు. ఇప్ప‌టికే అవినీతి, అక్ర‌మాల‌తో పాటు నేర‌స్థుల‌పై ఉక్కుపాదం మోపారు.

జ‌నం నేరం చేసేందుకు జంకుతున్నారు. ఎవ‌రైనా వేధింపుల‌కు పాల్ప‌డినా లేదా అక్ర‌మాల‌కు పాల్ప‌డినా తేలితే వెంట‌నే చంపేందుకు సైతం వెనుకాడ‌వద్దంటూ పిలుపునిచ్చారు.

దీంతో నేర‌స్థులు, మాఫియా గ్యాంగ్ స్ట‌ర్లు త‌మంత‌కు తాముగా పోలీస్ స్టేష‌న్ల‌లో లొంగి పోతున్నారు. తాజాగా సీఎం యోగి(CM Yogi) విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఉన్న‌తాధికారుల‌కు షాక్ ఇచ్చారు.

ఇటీవ‌ల ల‌క్నో లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌య్యారని 15 మందిపై వేటు వేశారు. వారిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అంతే కాకుండా నిర్ల‌క్ష్యంగా, అక్ర‌మాలకు పాల్ప‌డిన న‌లుగురు రిటైర్డ్ అధికారుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా ల‌క్నో లోని హ‌జ్ర‌త్ గంజ్ ప్రాంతంలోని హోటల్ లెవానాలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మ‌ర‌ణించారు. దీనిపై వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించారు సీఎం యోగి ఆదిత్యానాథ్. ల‌క్నో పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్బీ శిర‌ద్క‌ర్ , క‌మిష‌న‌ర్ (ల‌క్నో డివిజ‌న్ ) రోష‌న్ జాక‌బ్ ల‌తో కూడిన ఇద్ద‌రు స‌భ్యుల విచార‌ణ ప్యానెల్ త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించింది.

ఈ ఘ‌ట‌న‌కు నిర్లక్ష్యం, బాధ్య‌తా రాహిత్యమే కార‌ణ‌మ‌ని పేర్కొన‌డంతో సీఎం ఈ చ‌ర్య తీసుకున్నారు. అగ్ని ప్ర‌మాదంపై పోలీస్ క‌మిష‌న‌ర్ , డివిజ‌న‌ల్ క‌మిష‌న‌ర్ ఇచ్చిన నివేదిక మేర‌కు సీఎం చ‌ర్య‌లు తీసుకున్నార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి వెల్ల‌డించారు.

Also Read : ఢిల్లీ స‌ర్కార్ బ‌స్సుల కొనుగోలుపై విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!