Ghulam Nabi Azad : 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తా – ఆజాద్
వెల్లడించిన ట్రబుల్ షూటర్
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ట్రబుల్ షూటర్ గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) సంచలన ప్రకటన చేశారు. 10 రోజుల్లో తాను కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ లో ఆజాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అంతకు ముందు కాశ్మీర్ లో ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన వారం రోజుల తర్వాత ఈ కీలక ప్రకటన చేయడం కలకలం రేపింది.
ఇప్పటికే ఆయన తరపున మద్దతు ప్రకటించేందుకు పలువురు నాయకులు, కార్యకర్తలు ముందుకు వచ్చారు. 73 ఏళ్ల వయస్సు కలిగిన గులాం నబీ ఆజాద్ 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
పలు కీలక పదవులు చేపట్టారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఒక రకంగా చెప్పాలంటే ట్రబుల్ షూటర్ గా పేరొందారు.
జమ్మూ కాశ్మీర్ కు సీఎంగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా , పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఎన్నో రాష్ట్రాలకు ఇన్ చార్జీగా కూడా పని చేశారు.
కానీ గత కొంత కాలం నుంచీ పార్టీలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆపై తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటంచి విస్తు పోయేలా చేశారు.
పోతూ పోతూ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఆయన వల్లనే సీనియర్లు పార్టీని వీడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన కారణంగానే పార్టీ సర్వనాశనం అయ్యిందని మండిపడ్డారు.
కానీ దివంగత ప్రధానులు ఇందిర, రాజీవ్ లను పల్లెత్తు మాట అనలేదు. ఆపై సోనియాను కూడా విమర్శించక పోవడం విశేషం.
Also Read : బస్సులు మేం కొనుగోలు చేయలేదు