AAP Office Raid : అహ్మదాబాద్ ఆప్ ఆఫీస్ పై పోలీసుల దాడి
ఆరోపణలు చేసిన ఆప్ చీఫ్, సీఎం కేజ్రీవాల్
AAP Office Raid : ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉన్నది. ఈ తరుణంలో త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల్లో పాగా వేయాలని ఆప్ భావిస్తోంది.
ఇప్పటికే పలుమార్లు ఆప్ చీఫ్ ,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్యటించారు. తమకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో ఆప్ పార్టీ బాధ్యుడిపై బీజేపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి.
దీనిని తీవ్రంగా ఖండించారు ఆప్ చీఫ్. తాజాగా తమ పార్టీకి చెందిన అహ్మదాబాద్ ఆఫీస్ పై(AAP Office Raid) గుజరాత్ పోలీసులు దాడి చేశారంటూ ఆరోపించారు.
ఢిల్లీ సీఎం అహ్మదాబాద్ వచ్చిన వెంటనే ఈ దాడి జరిగిందంటూ ఆప్ గుజరాత్ శాఖ నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని వారు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయంలో పోలీసులకు ఏమీ దొరకలేదని ఈ సందర్భంగా వెల్లడించారు అరవింద్ కేజ్రీవాల్. ఆప్ కు రోజు రోజుకు రాష్ట్రంలో మద్దతు పెరుగుతోంది.
ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. జనం ఆదరణను చూసి తట్టుకోలేక పోతోంది గుజరాత్ బీజేపీ. అందుకే కావాలని దాడులకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు ఆప్ చీఫ్.
ఆప్ నాయకులు, కార్యకర్తలు కఠినమైన నిజాయతీ పరులని ప్రశంసించారు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు కాక పోయినా రేపు అయినా సరే ఎన్నిసార్లు దాడులు చేసినా లేదా సోదాలు చేపట్టినా వారికి ఒక్క పైసా దొరకదన్నారు .
ఏమైనా ఉంటే కదా దొరికేందుకు. ఆ దాడులేవో బీజేపీ ఆఫీసు పై చేస్తే ఏమైనా దొరికే ఛాన్స్ ఉండేదంటూ ఎద్దేవా చేశారు కేజ్రీవాల్.
Also Read : ‘జ్ఞానవాపి’ కేసుపై కీలక నిర్ణయం