HD Kumara Swamy : రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయం అవ‌స‌రం

క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార స్వామి

HD Kumara Swamy :  ప్ర‌స్తుతం దేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది. మ‌తం, కులం, ప్రాంతం, వ‌ర్గం పేరుతో మ‌నుషుల మ‌ధ్య విభేదాలు సృష్టించి రాజ‌కీయంగా ప‌బ్బం గ‌డుపుకునే సంస్కృతి పెరిగి పోతోంది.

ఓ వైపు ప్ర‌జా స‌మ‌స్య‌లు పేరుకు పోయినా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏలుతున్న మోదీనేన‌ని నిప్పులు చెరిగారు క‌ర్ణాట‌క మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి(HD Kumara Swamy).

ఆయ‌న హైద‌రాబాద్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. దేశంలో ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ప్ర‌త్యామ్నాయం అత్యంత అవ‌స‌ర‌మ‌న్నారు.

లేక పోతే రాచ‌రిక పాల‌న సాగుతుంద‌న్నారు. కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నం అభినంద‌న‌య‌మ‌ని ప్ర‌శంసించారు. తాము కూడా మ‌ద్ద‌తు తెలిపేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే భావ సారూప్య‌త క‌లిగిన పార్టీల‌న్నీ ఒకే తాటిపైకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. లేక పోతే ఒంటెద్దు పోక‌డకు ఊతం ఇచ్చినట్ల‌వుతుంద‌న్నారు.

బీజేపీ ముక్త భార‌త్ అన్న‌ది కావాల‌న్నారు. కేసీఆర్(CM KCR) ప‌రిణ‌తి క‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న‌కు అపార‌మైన అనుభ‌వం ఉంది. ఆ అనుభం దేశానికి కావాల‌న్నారు.

తాను ఏర్పాటు చేయ‌బోయే జాతీయ పార్టీకి సంపూర్ణ స‌హ‌కారం ఉంటుంద‌న్నారు. ప్ర‌ధానంగా ప్రాంతీయ పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, స‌హ‌కారం ఉండాల‌ని అభిప్రాయ ప‌డ్డారు.

కేసీఆర్, కుమార స్వామి చాలా సేపు చ‌ర్చించారు. దేశ రాజ‌కీయాల‌తో పాటు ప్ర‌స్తుతం చోటు చేసుకుంటున్న ప‌రిణామాల గురించి ప్ర‌త్యేకంగా ప్రస్తావించిన‌ట్లు స‌మాచారం. ద‌స‌రా పండ‌గ రోజు కేసీఆర్ కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read : ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటా 

Leave A Reply

Your Email Id will not be published!