Ajit Pawar : మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలి పోయాక శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు చెరో దారి చూసుకున్నాయి. ప్రస్తుతం శివసేనపై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన ఏక్ నాథ్ షిండే ఏకంగా సీఎంగా కొలువుతీరారు.
త్వరలో బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. పావులు కదిపేందుకు అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. ఇక మరాఠా రాజకీయాలలోనే కాదు దేశ రాజకీయాలలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను పొంది ఉన్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar).
ఆయన తలపండిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. తాజాగా అజిత్ పవార్ ఎన్సీపీ సమావేశం మధ్య లోంచే మాట్లాడకుండా వెళ్లి పోవడం ఆ పార్టీలో కలకలం రేపింది.
పార్టీలో అగ్ర నాయకుడిగా ఉన్నప్పటికీ మాట్లాడే అవకాశాన్ని దాట వేశారు. సమావేశంలో శరద్ పవార్ కూడా ఉన్నారు. ఆయన కూర్చోమని చెప్పినా వినిపించు కోకుండా వెళ్లి పోయారు.
ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది మరఠాలో. పార్టీ నాయకుడు జయంత్ పాటిల్ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన కొద్ది క్షణాలకే అజిత్ పవార్(Ajit Pawar) వేదిక నుంచి వెళ్లి పోవడం చర్చకు దారి తీసింది.
దీంతో పార్టీలో చీలిక వచ్చిందనే పుకార్లు షికార్లు చేశాయి. ఇదిలా ఉండగా రాద్దాంతం చెలరేగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అజిత్ పవార్ స్పందించాల్సి వచ్చింది.
ఇది జాతీయ స్థాయి సమావేశమని, తాను సమావేశంలో మాట్లాడ లేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఆయన మాట్లాడకుండానే శరద్ పవార్ ముగింపు పలకడం ఈ మొత్తం ఎపి సోడ్ ను రక్తి కట్టించేలా చేసింది. ఇదిలా ఉండగా శరద్ పవార్ తిరిగి ఎన్సీపీ చీఫ్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
Also Read : అహ్మదాబాద్ ఆప్ ఆఫీస్ పై పోలీసుల దాడి