Tejashwi Yadav : ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా – తేజస్వి
20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరుస్తా
Tejashwi Yadav : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
గతంలో ప్రభుత్వంలో లేని సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగులను ఆదుకోవాలని , వారికి భృతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
ఆపై ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఊహించని రీతిలో జేడీయూ చీఫ్ , సీఎం నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు కు కటీఫ్ చెప్పారు.
ఆపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జత కట్టారు. కొత్తగా మహా ఘట్ బంధన్ పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 31 మందితో కేబినెట్ విస్తరించారు.
ఇక ఆర్జేడీ చీఫ్ గా ఉన్న తేజస్వి యాదవ్(Tejashwi Yadav) డిప్యూటీ సీఎం గా కొలువు తీరారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రయారిటీ ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జాబ్స్ ను భర్తీ చేస్తామని ఆ మాటకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
సోమవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. మరోసారి ఆయన తాను చెప్పింది చేసేందుకు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు తేజస్వి యాదవ్. దీన్ని నమ్మని వారు లేదా ఆరోపణలు చేస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.
కొద్ది కాలం పాటు వేచి చూడండి. ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు డిప్యూటీ సీఎం. మరో కీలకమైన ప్రకటన చేశారు.
మేడం సోనియా గాంధీ ఇటలీ నుంచి ఇండియాకు వచ్చాక సీఎం నితీశ్ కుమార్ తో పాటు తన తండ్రి ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్లి కలుస్తారని చెప్పారు.
Also Read : ఎన్సీపీలో అజిత్ పవార్ కలకలం