Assam Police Arrest : అల్ ఖైదా అనుమానితుల అరెస్ట్

అస్సాంలో మ‌రో ఇద్ద‌రు అదుపులో

Assam Police Arrest : అల్ ఖైదాతో సంబంధం ఉన్న మ‌రో ఇద్ద‌రు ఉగ్ర‌వాద అనుమానితుల‌ను అస్సాం పోలీసులు(Assam Police Arrest) అరెస్ట్ చేశారు. ముసాదిక్ హుస్సేన్ , ఇక్రాముల్ ఇస్లాం బంగ్లాదేశ్ ఆధారిత ఉగ్ర‌వాద సంస్థ‌తో సంబంధాలు క‌లిగి ఉన్నారని పేర్కొంది.

ఈ ఇద్ద‌రిని అస్సాం లోని మోరిగావ్ లో అదుపులో తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు పోలీసులు. ఇదిలా ఉండ‌గా బంగ్లా దేశ్ లోని ఉగ్ర‌వాద సంస్థ ఉప ఖండం లోని అల్ ఖైదా అనుబంధ సంస్థ అన్స‌రుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో సంబంధాలు వీరికి ఉన్న‌ట్లు తెలిపారు.

నెల రోజుల‌కు పైగా ఈ ఇద్ద‌రి కోసం వెదుకుతున్న‌ట్లు వెల్ల‌డించారు. వీరు ఏబీటి మోరిగావ్ మాడ్యూల్ లో భాగంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

ఇంత‌కు ముందు అరెస్ట్ చేసిన ముఫ్తీ ముస్త‌ఫా అనే మ‌త గురువు నాయ‌క‌త్వం వ‌హించార‌ని చెప్ప‌బ‌డింది. కాగా మోరిగావ్ జిల్లాలో ఒక మ‌ద‌ర్సాను ఏక్యూఐఎస్ మాడ్యూల్ లో అనుమానిత ఉగ్ర‌వాద సంబంధాలు ఉన్నాయ‌నే అనుమానంతో కూల్చి వేశారు.

గ‌త నెల‌లో అస్సాం ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని, రాష్ట్రంలో జిహాది స్లీప‌ర్ సెల్స్ ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ నాలుగు మ‌ద‌ర్సాల‌ను కూల్చి వేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం.

అస్సాం జిహాదీ కార్య‌క‌లాపాల‌కు కేంద్రంగా మారింద‌ని గ‌త నెల‌లో ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శ‌ర్మ పేర్కొన్నారు. ఎవ‌రినీ ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఇందులో భాగంగా మ‌సీదులు, మ‌ద‌ర్సాల‌లో మ‌త గురువులు రాష్ట్రం వెలుపల నుండి వ‌చ్చిన‌ట్ల‌యితే ప్ర‌భుత్వ పోర్ట‌ల్ లో న‌మోదు చేసుకోవాల‌ని ఆదేశించారు.

Also Read : ఎన్సీపీలో అజిత్ ప‌వార్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!