CM KCR : వ్యవసాయం..విద్యుత్ అమ్మేందుకు కుట్ర
కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగిన కేసీఆర్
CM KCR : దేశంలో అన్నింటిని అమ్ముకుంటూ వస్తున్న మోదీ ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్ పై కన్నేశారంటూ ఆరోపించారు సీఎం కేసీఆర్. సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో సీఎం(CM KCR) ప్రసంగించారు.
విద్యుత్ సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పటికే ఓడ రేవులు, విమానాలు ఇలా అమ్ముకుంటూ పోయారు.
ఇక మిగిలింది ఈ రెండు కీలకమైన రంగాలు మాత్రమే. వీటిని కూడా అమ్మేస్తే ఇక మిగిలేది ఏమీ ఉండదన్నారు కేసీఆర్. అత్యంత దుర్మార్గమైన ఆలోచనలతో షావుకార్లకు కట్ట బెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మోదీపై నిప్పులు చెరిగారు.
సంస్కరణ అనే అందమైన ముసుగు తగిలించి ఇష్టానుసారం అమ్మేందుకు యత్నించడం దారుణమన్నారు సీఎం. రైతులు ఎక్కడైనా అమ్ము కోవచ్చని చెబుతున్నారని ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు.
పెట్రోల్, డీజిల్ రేట్లతో భారం మోపడం వల్ల జనం అతలాకుతలం అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. ఎరువులు, ఆయిల్ ధరలు, కోసే ధరలు పెరిగేందుకు మీటర్లు పెట్టాలని అంటున్నారంటూ ఆరోపించారు.
షావుకార్లకు పొలాలు అప్పగించాలని కుట్ర చేస్తున్నాడంటూ మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై(PM Narendra Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆహార సబ్సిడీలు కూడా ఎత్తి వేశారని, రైతులను ఆగం పట్టించేందుకు ప్రధాన మంత్రి కంకణం కట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు. తామంతా ఢిల్లీకి వెళ్లి అభ్యంతరం తెలిపామని , పీయూష్ గోయల్ తమను అవమానించేలా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.
Also Read : పశువుల వ్యాధుల కట్టడికి వ్యాక్సిన్ సిద్దం – మోదీ