Gyanvapi Case : జ్ఞానవాపి కేసులో ముస్లింలకు బిగ్ షాక్
హిందూ మహిళలకు భారీ ఊరట
Gyanvapi Case : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన జ్ఞానవాపి కేసులో(Gyanvapi Case) కీలక తీర్పు వెలువరించింది వారణాసి కోర్టు. సోమవారం సుదీర్ఘ విచారణ జరగనుంది. ఒక రకంగా హిందూ మహిళలకు భారీ ఊరటనిచ్చింది.
సంబురాల్లో మునిగి పోయారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వారణాసి కోర్టుకు బదిలీ చేసింది. దీంతో కీలక వ్యాఖ్యలు చేసింది.
జ్ఞానవాపిలో పూజలు చేయకూడదంటూ, అక్కడ శివ లింగం బయట పడలేదంటూ మజీదు కమిటీ అంజుమన్ ఇంతజామియా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది. చివరకు దావాను కొట్టి వేసింది. యూపీలోని కాశీ లోని ప్రఖ్యాత విశ్వనాథ ఆలయం పక్కనే జ్ఞాన వాపి మసీదు ఉంది.
ఇదిలా ఉండగా మసీదు ఆవరణలో ఉన్న హిందూ దేవతలను పూజించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ అయిదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు.
తమకు పూజలు చేసుకోవాలని ఉందని కానీ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి దావాను వారణాసి కోర్టు సమర్థించింది.
జ్ఞాన వాపి(Gyanvapi Case) మసీదు వక్ఫ్ ప్రాపర్టీ కిందకు వస్తుందని అంజుమన్ కమిటీ కోర్టులో అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు వాదించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న కోర్టు సీరియస్ అయ్యింది.
ఈ మేరకు ముస్లింలు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి పారేసింది. హిందువులు వేసిన దావా చెల్లుతుందని స్పష్టం చేసింది. జిల్లా జడ్జి విశ్వేశ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఇదిలా ఉండగా దీనిని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ముస్లింలు వెల్లడించారు.
Also Read : అభిషేక్ బెనర్జీ కోడలికి అర్ధరాత్రి సమన్లు