Ajit Pawar : అసంతృప్తి అబద్దం ప్రచారం అవాస్తవం
ఎన్సీపీలో కలకలం పై అజిత్ పవార్
Ajit Pawar : మరాఠా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో అసంతృప్తి నెలకొందని, తాను అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లి పోయానంటూ వస్తున్న ప్రచారం పూర్తి అబద్దమన్నారు ఎన్సీపీ అగ్ర నాయకుడు అజిత్ పవార్(Ajit Pawar).
తాను కావాలని బయటకు వెళ్ల లేదని వాష్ రూమ్ కి మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. ఆదివారం మరాఠాలో ఎన్సీపీ జాతీయ సమావేశం జరిగింది.
ఈ కీలక మీటింగ్ లో ఆసక్తికర, ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనకు వరుస మామ అయిన రాజకీయ అనుభవం కలిగిన శరద్ పవార్ కంటే ముందే వేదిక నుండి బయలు దేరి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో ఆ పార్టీ నాయకుడు , దాని మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ తను ప్రసంగిస్తుండగా అజిత్ పవార్ వెళ్లి పోవడం కీలకమైన చర్చకు దారి తీసింది.
ఎమ్మెల్యేగా, మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్(Ajit Pawar) తనను మాట్లాడ నివ్వక పోవడం వల్ల వెళ్లి పోయారన్న వార్తలను ఖండించారు.
దీంతో మామా అల్లుళ్ల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, విభేదాలు ఉండడం వల్లనే ఆయన మాట్లాడకుండా వెళ్లి పోయారంటూ ప్రచారం ఊపందుకుంది.
ఇదిలా ఉండగా రెండు రోజుల సదస్సులో ముగింపు కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వక్తలలో ఒకరిగా ఉంటారని భావించారు.
ఇదిలా ఉండగా మామ ముందే వెళ్లి పోతుండగా అజిత్ బంధువు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఆయన పట్టించు కోకుండా వెళ్లి పోయారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
Also Read : కోర్టు తీర్పుతో హిందువుల సంబురాలు