Mukul Rohatgi : భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్ గా ముకుల్ రోహ‌త్గీ

ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న కేకే వేణుగోపాల్

Mukul Rohatgi :  గ‌తంలో భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్ గా ప‌ని చేసిన ముకుల్ రోహ‌త్గీ(Mukul Rohatgi) తిరిగి రానున్నారు. ఆయ‌న 2017 జూన్ లో అటార్నీ జ‌న‌ర‌ల్ గా వైదొలిగారు.

ప్ర‌స్తుతం భార‌త అత్యున్న‌త‌మైన ప‌ద‌విగా భావించే అటార్నీ జ‌న‌ర‌ల్ గా కేకే వేణుగోపాల్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా కేకే వేణుగోపాల్ ప‌ద‌వీ కాలం సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు మాత్ర‌మే ఉంది.

మ‌ళ్లీ ఆయ‌న‌ను పొడిగించే అవ‌కాశం లేదు. దీంతో ఎవ‌రు త‌దుప‌రి భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్ అవుతార‌నే ఉత్కంఠ‌కు తెర దించుతూ తిరిగి మ‌రోసారి ఏజీగా ముకుల్ రోహ‌త్గి ఉంటార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ముకుల్ రెండోసారి ఆయ‌న తిరిగి అక్టోబ‌ర్ 1న ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. వేణుగోపాల్ ప‌ద‌వీ విర‌మ‌ణ చ‌సిన త‌ర్వాత సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వైపు మొగ్గు చూపింది కేంద్ర న్యాయ వ్య‌వ‌స్థ‌.

ఇదే స‌మ‌యంలో ముకుల్(Mukul Rohatgi) భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్ గా, ప్ర‌భుత్వ అత్యున్న‌త న్యాయ‌వాదిగా తిరిగి వ‌స్తార‌ని న్యాయ వర్గాలు వెల్ల‌డించాయి.

ఇప్ప‌టికే కేకే వేణుగోపాల్ ప‌ద‌వీ కాలాన్ని పొడిగించారు. 2017లో ఏజీ ప‌ద‌వి నుంచి వైదొలిగాక వేణుగోపాల్ వ‌చ్చారు. ఆయ‌న ఐదేళ్ల పద‌వీ కాలం పూర్త‌యింది.

కేంద్రంలో ఉన్న‌త న్యాయాధికారిగా ప‌ని చేశాడు. ఇదిలా ఉండ‌గా 2020లో మూడేళ్ల ప‌ద‌వీ కాలం పూర్తి చేసుకున్న‌ప్పుడు త‌న‌ను విడిచి పెట్టాలంటూ కేంద్రాన్ని కోరాడు.

వేణుగోపాల్ వ‌య‌స్సు 91 ఏళ్లు. కాగా కేంద్రం ఒప్పు కోలేదు. కొంత కాలం పాటు ఉండాల‌ని కోరడంతో మ‌న్నించాడు.

Also Read : సక్సెస్ సాధించాలంటే స్టార్లు అక్క‌ర్లేదు

Leave A Reply

Your Email Id will not be published!