Ashok Chandana : సచిన్ పైలట్ పై చందానా సీరియస్
బూట్లు విసిరిన వివాదంపై ఆగ్రహం
Ashok Chandana : బూట్లు విసిరిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపింది. గుర్జర్ నాయకుడు కల్నల్ కిరోరి సింగ్ బైన్సా అస్థికల నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సచిన్ పైలట్(Sachin Pilot) మద్దతుదారులు కాంగ్రెస్ నాయకులపై బూట్లు విసిరారు.
దీనిపై సీరియస్ గా స్పందించారు రాజస్థాన్ క్రీడా శాఖ మంత్రి అశోక్ చందానా(Ashok Chandana). ఇంత జరిగినా మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ స్పందించక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఇప్పుడే ఇలాగే ఉంటే రేపొద్దున సచిన్ పైలట్ సీఎం అయితే పరిస్థతి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఆందోళనకరంగా ఉందన్నారు మంత్రి.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం రాజస్థాన్ లో అనేక ఆందోళనలకు నాయకత్వం వహించారు గుర్జార్ నాయకుడు కల్నల్ కిరోరి సింగ్ భైంస్లా( Kirori Singh Bainsla) ఇటీవల మరణించారు.
ఆయన స్మృత్యర్థం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో బూట్లు విసిరిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ , లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, కాంగ్రెస్ ఎమ్మెల్యే, పరిశ్రమల శాఖ మంత్రి శకుంతలా రావత్, క్రీడా శాఖ మంత్రి అశోక్ చందనా(Ashok Chandana), తదితరులు పాల్గొన్నారు.
కాగా గుర్దార్ వర్గానికి చెందిన సచిన్ పైలట్ అక్కడ లేరు. తమ నాయకుడిని ఆహ్వానించ లేదంటూ ఆయన మద్దతుదారులు కొందరు బూట్లు విసిరారు. దీంతో గందరగోళం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి వచ్చారు.
Also Read : గులాం నబీ ఆజాద్ పై మెహబూబా కన్నెర్ర