Rahul Gandhi : దేశం ఏకం కోసమే పాదయాత్ర – రాహుల్
కేంద్ర సర్కార్, బీజేపీపై కాంగ్రెస్ నేత ఫైర్
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర సర్కార్, బీజేపీ పార్టీ , దాని అనుబంధ సంఘాలను టార్గెట్ చేశారు.
వాళ్లు ప్రాంతం, కులం, మతం, విద్వేషాలతో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కానీ తాము ఎక్కడికక్కడ విడి పోయిన వారందరినీ ఒకే చోటుకు చేర్చే పనిలో పడ్డామన్నారు.
అందుకే భారత్ జోడో యాత్రను చేపట్టామని రాహుల్ గాంధీ(Rahul Gandhi) చెప్పారు. ఈ యాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. తమిళనాడులో ముగిసింది. కేరళలలో కొనసాగుతోంది.
18 రోజుల పాటు ఇక్కడ యాత్రలో పాల్గొంటారు రాహుల్ గాంధీ. నా పాదాలు కంది పోయినా నేను బాధ పడను. కానీ దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా చూస్తానని, అంత వరకు తాను నిద్ర పోనని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా నిన్నటి సాయంత్రం వరకు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అడపాదడపా వర్షాలు, ప్రజల రద్దీ మధ్య భారత్ జోడో యాత్ర మంగళవారం కేరళలో మూడో రోజుకి చేరింది.
ఆయన వెంట మద్దతుదారులు, అభిమానులు, నాయకులు నడుస్తున్నారు. 3,570 కిలోమీటర్ల పాదయాత్ర కాశ్మీర్ వరకు కొనసాగుతుంది. ఆయనకు స్వాగతం పలికేందుకు జనం బారులు తీరారు.
ఈ సందర్బంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వేషం, హింస, కోపంతో ఎన్నికలను గెలవవచ్చు. కానీ దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించ లేమన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు మోదీని ఉద్దేశించి.
Also Read : బెంగాల్ లో బీజేపీ ఆందోళన ఉద్రిక్తం