Good Bye Jaikal Mahakal : కంట తడి పెట్టిస్తున్న జైకాల్ మహాకాల్
షేర్ చేసిన రష్మిక మందాన సాంగ్ వీడియో
Good Bye Jaikal Mahakal : నేషనల్ క్రష్ గా పేరొందిన రష్మిక మందాన, ప్రముఖ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన గుడ్ బై మూవీ త్వరలో విడుదల కానుంది.
ఇందుకు సంబంధించి జై కాల్ మహాకాల్(Good Bye Jaikal Mahakal) పేరుతో తీసిన సాంగ్ ను పంచుకుంది రష్మిక మందన్నా తన ఇన్ స్టా గ్రామ్ లో. ఈ సందర్భంగా తనకు మాటలు రావడం లేదని పేర్కొంది.
మనిషి తన జీవిత కాలంలో జర్నీ ఎలా సాగుతుంది. చివరకు ఎలా అంతం అవుతుందనే దానిపై జై కాల్ మహా కాల్ పేరుతో పాట రూపొందింది.
బిగ్ బి, రష్మిక కలిసి ఉండడం ఇందులో ప్రత్యేకత. ఈ పాటను అమిత్ త్రివేది, సుహాస్ సావంత్ పాడారు. వీడ్కోలు పలికే పాట. ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి నిష్క్రమించాల్సిందే.
ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వీడ్కోలు చెప్పాల్సిందే. గుడ్ బై నిర్మాతలు మొదటి ట్రాక్ ను పంచుకున్నారు. ఈ చిత్రంలో నీనా గుప్తా , అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు.
ట్రైలర్ దెబ్బతిన్న రిలేషన్ షిప్ డైనమిక్స్ ని ప్రదర్శించింది. కానీ జైకల్ మహాకాల్ ట్రాక్ దుఖః సమయంలో కుటుంబం ఎలా ఐక్యంగా ఉంటుందో చూపిస్తుంది.
అమితాబ్ బచ్చన్(Amitabh Bachan) తన భార్య నీనా గుప్తా చితాభస్మాన్ని నిమజ్జనం చేస్తున్నప్పుడు ఎలా ఉంటాడు. తన కూతురుగా నటించిన రష్మిక మందాన ఎలా కంట్రోల్ చేసుకుంటుందనే దానిని చిత్రీకరించారు.
పావైల్ గులాటి బిగి బి కొడుకుగా నటించారు. పాట మొత్తం రష్మిక , బిగ్ బి నీనా గుప్తాతో గడిపిన మంచి, పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సాంగ్ ను అమిత్ త్రివేది స్వర పరిచారు. స్వానంద్ కిర్కిరే సాహిత్యం అందించారు.
Also Read : పంతులమ్మకు చిన్నారి క్షమాపణ వైరల్