Drugs Dropped : లిస్ట్ నుంచి 26 మందులు తొల‌గింపు

ప్ర‌క‌టించిన మంత్రి మ‌న్సుఖ్ మాండవియా

Drugs Dropped : కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోని అత్య‌వ‌స‌ర మందుల జాబితా నుంచి 26 మందుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వియా వెల్ల‌డించారు. ధ‌ర ప‌రిమితిని కూడా ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైన మందుల కొత్త జాబితాలో 34 మందులు ఉన్నాయి.

కాగా 26 మందుల‌ను ఎమ‌ర్జెన్సీ లిస్టు నుంచి తొల‌గించిన‌ట్లు(Drugs Dropped) తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి స‌వ‌రించిన నేష‌న‌ల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియ‌ల్ మెడిష‌న్స్ (ఎన్ఎల్ఇఎం) ను విడుద‌ల చేశారు.

ఇందులో 27 కేట‌గిరీల‌కు చెందిన 384 మందులు క‌నిపించ‌వు. వీటిలో రానిటిడ‌న్ కూడా ఉంది. త‌ర‌చుగా అసిడిటి, ఇత‌ర క‌డుపు సంబంధిత వ్యాధుల కోసం ఈ మందును తీసుకుంటారు.

రాంటాక్ వంటి బ్రాండ్ పేర్ల‌తో వీటిని అమ్ముతారు. జినెటాక్ , ఎయిలో మందుల‌ను కూడా తొల‌గించారు. ఇదిలా ఉండ‌గా 2020లో ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్డీఏ) త‌క్కువ స్థాయి ఎన్ నైట్రోసోడిమెథైల‌న్ ఉనికిని వెల్ల‌డించాక అన్ని రానిటిడిన్ ఉత్ప‌త్తుల‌ను రీకాల్ చేసింది.

ఇక జాబితా నుంచి తీసేసిన మందులు ఇలా ఉన్నాయి. ఆల్టె ప్లేస్ , అటెనో లోల్ , బ్లీచింగ్ పౌడ‌ర్ , కాప్రోమైసిన్, సెట్రిమైడ్ , క్లోర్పెనిస‌న్ , డిలోక్స‌నైడ్ ప్యూరోయేట్ ఉన్నాయి.

వీటితో పాటు డిమోర్కాప్రోల్ , ఎరిత్రోమైసిన్ , ఇథినైల్రాడియోల్, ఇథినైల్ స్ట్రాడియోల్, నోరెథిస్టిరాన్ , గాన్సిక్లోవిర్ ముందులున్నాయి.

క‌నా మైసిన్ , లామివుడి , నెవిరాపైన్ , స్టావుడిన్ , లెఫ్లునోమైడ్ , మిథైల్డోపా , నికోటినా మైడ్ , పెగిలేటెడ్ ఇంట‌ర్పెరాన్ ఆల్ఫా2ఏ, పెలిగేటెడ్ ఇంట‌ర్పెరాన్ ఆల్ఫా 2బి ఉన్నాయి.

పెంట‌మిడిన్ , ప్రిలోకైన్ , లిగ్నోకైన్ , ప్రోకార్బ‌జైన్ ,రానిటిడిన్ , రిఫాబుటిన్ , స్టావుడిన్ , లామివుడిన్ , సుక్రాల్ఫేట్ , వైట్ పెట్రోలేటం మందులున్నాయి.

Also Read : పంతులమ్మ‌కు చిన్నారి క్ష‌మాప‌ణ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!