Nirmala Sitharaman : చైనాకు ధీటుగా భార‌త్ – సీతారామ‌న్

ధీమా వ్య‌క్తం చేసిన ఆర్థిక శాఖ మంత్రి

Nirmala Sitharaman :  దేశ ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చైనాకు ప్ర‌త్యామ్నాయంగా భార‌త్ ఎదుగుతోంద‌న్నారు. వ‌చ్చిన అవ‌కాశాల‌ను ఉప‌యోగించు కోవాల‌ని పిలుపునిచ్చారు.

అనుకూల‌మైన విధాన వాతావ‌ర‌ణం ఇండియాలో ఉంద‌న్నారు. అందుకే చాలా ప‌రిశ్ర‌మ‌లు ఇక్క‌డికి వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ప్రపంచ సంస్థ‌లు త‌యారీ స్థావ‌రాల‌ను ఏర్పాటు చేసేందుకు చైనా కంటే భార‌త్ కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ అపార‌మైన సామ‌ర్థ్యాన్ని గ్ర‌హించాల‌ని కేంద్ర మంత్రి వ్యాపార‌వేత్త‌ల‌కు సూచించారు. మంగ‌ళ‌వారం ఆమె కీల‌క స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. నేను ఇండియ‌న్ ఇంక్ నుండి వినాల‌ని అనుకుంటున్నాన‌ని అన్నారు.

మిమ్మ‌ల్ని ఇక ఆపేది ఎవ‌రు. విదేశాల‌కు చెందిన సంస్థ‌లు భార‌త్ అత్యంత ఆమోద యోగ్య‌మైన ప్ర‌దేశ‌మ‌ని భావిస్తున్నార‌ని తెలిపారు.
ఈ త‌రుణంలో వ‌న‌రుల‌ను గుర్తించి వాడుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు నిర్మ‌లా సీతారామ‌న్.

హీరో మైండ్ మైన్ స‌మ్మిట్ లో ఈ వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర మంత్రి. యుఎస్ , చైనా, జ‌పాన్, జ‌ర్మ‌నీ త‌ర్వాత ప్రపంచంలోని ఐదో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఉన్న యుకెను భార‌త్ అధిగమించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా నిర్మ‌లా గుర్తు చేశారు.

భార‌త దేశ వృద్దిలో దూకుడుగా పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. మీ స్వంత సామ‌ర్థ్యాల‌పై మీకు న‌మ్మ‌కం లేదా అని ప్ర‌శ్నించారు. భార‌తీయ ప‌రిశ్ర‌మ నుండి ఇంకా తెలుసు కోవాల‌ని అనుకుంటున్నాన‌ని అన్నారు నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman).

తాను ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ప‌రిశ్ర‌మ అనుకూల మైన‌దిగా భావించ‌డం లేద‌ని వింటున్నాన‌ని తెలిపారు.

Also Read : లిస్ట్ నుంచి 26 మందులు తొల‌గింపు

Leave A Reply

Your Email Id will not be published!