Owaisi : ఉత్త‌రాఖండ్ సీఎంపై ఓవైసీ సీరియ‌స్

మ‌ద‌ర్సాలపై స‌ర్వే అవ‌స‌ర‌మ‌ని కామెంట్స్

Owaisi :  ఎంఐఎం చీఫ్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ(Owaisi)  షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న మ‌ద‌ర్సాలు ఎన్ని ఉన్నాయ‌నే దానిపై స‌ర్వే చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు ఓవైసీ.

అస్సాం, ఉత్త‌రాఖండ్ రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ణ‌యం ముస్లింల‌ను వేధించేందుకే త‌ప్పా మ‌రొక‌టి కాద‌న్నారు. ఓవైసీతో పాటు ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు కూడా తీవ్రంగా మండిప‌డ్డాయి.

ఓవైసీ గ‌తంలో స‌ర్వేను మినీ ఎన్ఆర్సీ గా పేర్కొన్నారు. అంటే అర్థం నేష‌న‌ల్ రిజిస్ట‌ర్ ఆఫ్ సిటిజ‌న్స్ అని. ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మ రాష్ట్రంలో స‌ర్వే చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌న్నారు సీఎం ధామి.

కొన్ని గంట‌ల త‌ర్వాత ఎంఐఎం చీఫ్ తీవ్రంగా స్పందించారు. యూపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని గుర్తించ‌బ‌డ‌ని మ‌ద‌ర్సాల‌లో ఉపాధ్యాయుల సంఖ్య‌, పాఠ్యాంశాలు, అక్క‌డ అందుబాటులో ఉన్న ప్రాథ‌మిక సౌక‌ర్యాల గురించి స‌మాచారాన్ని సేక‌రించేందుకు స‌ర్వే నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు పుష్క‌ర్ సింగ్ ధామి.

స‌మాచారం లేదా ఇత‌ర వివ‌రాల కోసం కాద‌ని ముస్లింల‌ను టార్గెట్ చేయ‌డంలో భాగ‌మేన‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ఓవైసీ(Owaisi) .

ఇది ముస్లిం స‌మాజానికి వ్య‌తిరేకంగా ల‌క్ష్యంగా చేసుకున్న స‌ర్వేగా పేర్కొన్నారు ఎంపీ. ప్ర‌ధానంగా ప్రైవేట్ పాఠ‌శాల‌లు, మిష‌న‌రీలు, స‌ర్కార్ స్కూళ్లు, ఆర్ఎస్ఎస్ ఆధ్వ‌ర్యంలో బ‌డుల‌పై స‌ర్వే జ‌ర‌గాల‌ని ఓవైసీ డిమాండ్ చేశారు.

 

Also Read : పీపీ ప్రోబ్ ఏజెన్సీకి పోస్టాఫీస్ కాదు

Leave A Reply

Your Email Id will not be published!