Pema Khandu : రాహుల్ గాంధీకి అంత సీన్ లేదు – ఖండూ

ఈశాన్య రాష్ట్రాల గురించి తెలిసింది త‌క్కువే

Pema Khandu : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై(Rahul Gandhi) నిప్పులు చెరిగారు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం ఫెమా ఖండూ. ఆయ‌న‌కు ఈశాన్య రాష్ట్రాలపై అవ‌గాహ‌న లేద‌న్నారు.

న్యూఢిల్లీకి వ‌చ్చిన ఫెమా ఖండూ మీడియాతో మాట్లాడారు. భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్ గాంధీకి అంత సీన్ లేద‌న్నారు. ఇంకా రాజ‌కీయంగా ఓన‌మాలు నేర్చుకుంటున్నార‌ని, స‌మ‌స్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న ఎంత మాత్రం లేద‌ని ఎద్దేవా చేశారు ఫెమా ఖండూ(Pema Khandu).

అవ‌హ‌న లేకుండా, ఆధారాలు చూపించ‌కుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఈమ‌ధ్య రాహుల్ గాంధీకి అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు సీఎం. త‌న‌కు అవ‌గాహ‌న లేదంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొన‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

అధికారం పోయిన బాధ‌లోనే ఇంకా కాంగ్రెస్ బ‌తుకుతోంద‌న్నారు ఫెమా ఖండూ. బీజేపీ వాషింగ్ మెషిన్ లో ఖండూ కూడా ఒక‌రు అంటూ ఆ పార్టీ పేర్కొనడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం(Pema Khandu).

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో చైనా చొర‌బాటు చేసేందుకు ఎలాంటి ఆస్కారం లేద‌న్నారు. రాహుల్ గాంధీ ఆరోపించిన దాంట్లో వాస్త‌వం లేద‌న్నారు ఫెమా ఖండూ.

అంతే కాదు ఆయ‌న లేవనెత్తిన కార్య‌క‌లాపాల‌న్నీ చైనా భూభాగంలోనే ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. సోష‌ల్ మీడియాలో చైనీయులు త‌మ భూభాగంలోకి ప్ర‌వేశించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంత సీన్ రాహుల్ కు కానీ చైనాకు కానీ లేద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఫెమా ఖండూ. కాగా 1000 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల భార‌త భూభాగాన్ని చైనా ఆక్ర‌మించు కుంద‌ని మోదీ నిద్ర పోతున్నారా అంటూ ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ.

Also Read : మోదీ వ‌ల్లే గుజ‌రాత్ కు చిప్ ఫ్యాక్ట‌రీ – ప‌వార్

Leave A Reply

Your Email Id will not be published!