Covid19 : కలవర పెడుతున్న కరోనా కేసులు
ఒక్క రోజే 6,298 కేసుల నమోదు
Covid19 : కరోనా తగ్గుముఖం పట్టినా రోజు రోజుకు కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర సర్కార్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.
తాజాగా 6,298 కొత్తగా కరోనా కేసులు(Covid19) నమోదయ్యాయి. గత 24 గంటల్లో 19 మంది కరోనా వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రకు చెందిన ఏడుగురు, ఢిల్లీకి చెందిన ముగ్గురు ఉన్నారు.
మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులో 2.04 శాతంగా ఉన్నాయి. కోవిడ్(Covid19) రికవరీ రేటు 98.71 శాతానికి పెరిగిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 4,45,22,77కు చేరుకుందని వెల్లడించింది.
కాగా యాక్టివ్ కేసులు 46,748కి పెరిగాయి. 22 మరణాలతో మొత్తం ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,28,273కి చేరుకుంది. ఇందులో కేరళకు చెందిన నలుగురు మరణించారు.
రోజు రోజుకు కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండడంతో బూస్టర్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే దేశంలోని ప్రతి చోటా టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.
మంత్రిత్వ శాఖ ప్రకారం రోజూ వారీ సానుకూలత రేటు 1.89 శాతంగా ఉండగా వారపు అనుకూలత రేటు 1.70 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,39,47,756కి పెరిగింది.
కాగా కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 216.17 కోట్ల మేర వ్యాక్సిన్లు ఇచ్చినట్లు తెలిపింది మంత్రిత్వ శాఖ.
కాగా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది కేంద్రం.
Also Read : ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దాడులు