MLC Kavitha ED : మ‌ద్యం స్కాంలో క‌విత‌కు ఈడీ నోటీసులు

దేశ వ్యాప్తంగా 40 చోట్ల దాడుల ప‌రంప‌ర

MLC Kavitha ED :  సీఎం కేసీఆర్ కూతురుకు బిగ్ షాక్ త‌గిలింది. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కుంభ‌కోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)(MLC Kavitha ED) శుక్ర‌వారం నోటీసులు జారీ చేసింది.

ప్ర‌స్తుతం ర‌ద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ పాల‌సీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై మ‌నీ లాండ‌రింగ్ విచార‌ణ‌లో భాగంగా శుక్ర‌వారం దేశ వ్యాప్తంగా దాదాపు 40 ప్రాంతాల్లో ఈడీ తాజా దాడులు చేప‌ట్టింది.

గ‌త నెల ఆగ‌స్టు 21న ప‌శ్చిమ ఢిల్లీ ఎంపీ ప‌ర్వేష్ సాహిబ్ సింగ్ వ‌ర్మ‌, మాజీ ఎమ్మెల్యే మంజీంద‌ర్ సిర్సా ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో తెలంగాణ‌కు సంబంధాలు ఉన్నాయ‌ని అనుమానిస్తున్నారు.

సీఎం కేసీఆర్ కుటుంబీకుల పాత్ర ఉంద‌ని అనుమానిస్తున్నారు. దేశ రాజ‌ధానిలో జ‌రిగిన కోట్లాది రూపాయ‌ల మ‌ద్యం పాల‌సీ స్కాంలో మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha ED) పేరును కూడా లాగారు.

కొత్త మ‌ద్యం పాల‌సీలో అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆగ‌స్టు 17న సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా తో పాటు మ‌రో 14 మందిపై కేసు న‌మోదు చేసి. రెండు వారాల త‌ర్వాత ఆప్ నేత‌, ఇత‌ర నిందితుల‌కు సంబంధించిన స్థలాల‌పై సీబీఐ దాడులు చేప‌ట్టింది.

సిసోడియాను సీబీఐ త‌న ఎఫ్ఐఆర్ లో నంబ‌ర్ వ‌న్ గా పేర్కొంది. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రిని చేర్చింది. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల క‌ల్వ‌కుంట్ల క‌విత ఓ ఛాన‌ల్ తో మాట్లాడుతూ త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు.

ఆమె ఇప్ప‌టికే త‌నపై ఎవ‌రూ మాట్లాడ కూడ‌దంటూ కోర్టుకు ఎక్కారు. ఈ మేర‌కు కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది.

Also Read : బాల‌కృష్ణ‌తో పాటు ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్

Leave A Reply

Your Email Id will not be published!