AP Govt Supreme Court : హైకోర్టు తీర్పుపై సుప్రీంలో ఏపీ సవాల్
అమరావతి ఏపీకి ఏకైక రాజధానిపై ఫైర్
AP Govt Supreme Court : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే తమకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిన హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టును(AP Govt Supreme Court) ఆశ్రయించనుంది.
గతంలో అమరావతిని ఏకైక రాష్ట్ర రాజధానిగా రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది ఏపీ ప్రభుత్వం. దీనిని సవాల్ చేస్తు సుప్రీంను ఆశ్రయించింది.
శాసనసభ అసమర్థత, అధికార దుర్వినియోగం, ఏకపక్షం కారనంగా మార్చి 3న రాష్ట్ర హైకోర్టు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు రాజధానుల నిర్ణయాన్ని రద్దు చేసింది.
ఇప్పటికే సీఎం ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని డిక్లేర్ చేశారు. వాటిలో కర్నూలు, విశాఖ పట్టణం, అమరావతి ఉన్నాయి. ఈ నిర్ణయం పూర్తిగా తప్పు అంటూ పేర్కొంది హైకోర్టు.
ఇప్పటికే అమరావతిని రాజధానిగా ప్రకటించింది గతంలో ఏలిన టీడీపీ ప్రభుత్వం. 30,000 వేల మంది రైతుల జీవనోపాధిని, జీవించే హక్కును కోల్పోయిందని పేర్కొంది కోర్టు.
ఇదిలా ఉండగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొందిన ప్రణాళికలో భాగంగా అమరావతిని శాసనసభ రాజధానిగా, విశాఖ పట్టణాన్ని కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
గత ఆగస్ట్ లో అమరావతి పనుల పురోగతికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ను హైకోర్టులో సమర్పించారు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్.
ఇదిలా ఉండగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసుకునే హక్కు ఏపీకి ఉందని ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
Also Read : తారళ తళుకు బెళుకులు రక్షిస్తాయా