Ashok Gehlot : పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి ఇవ్వాలి
స్పష్టం చేసిన రాజస్థాన్ సీఎం గెహ్లాట్
Ashok Gehlot : కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎవరు ఎన్నికవుతారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ పార్టీ అధ్యక్ష పదవికి వచ్చే నెల అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి.
అదే నెల 19న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఇప్పటికే రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. గత కొంత కాలంగా గాంధీ ఫ్యామిలీ వర్సెస్ నాన్ గాంధీ ఫ్యామిలీ మధ్య యుద్దం నడుస్తోంది.
ఈ తరుణంలో మొదటి నుంచీ రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయనే సరైన నాయకుడని పేర్కొన్నారు.
జైపూర్ లో జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) సమావేశంలో రాహుల్ ను కాంగ్రెస్ చీఫ్ గా చేయాలంటూ తీర్మానాన్ని ప్రతిపాదించారు సీఎం అశోక్ గెహ్లాట్.
కాగా గాంధీని మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టేలా ఒప్పించే ప్రయత్నంలో రాజస్థాన్ అటువంటి తీర్మానాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఇతర రాష్ట్ర విభాగాలు కూడా ఇదే బాట పట్టాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సెప్టెంబర్ 24న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ సమావేశం జరగనుంది. ఇదిలా ఉండగా రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ ఖచారి మాట్లాడారు.
రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్ ని నియమించేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులను నామినేట్ చేసేందుకు తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలిపారు.
Also Read : మోదీ..ట్రెండ్ సెట్టర్..టార్చ్ బేరర్