TMC Slams BJP : వాళ్లు పొలిటికల్ టూరిస్టులు – టీఎంసీ
బీజేపీ నేతల నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం
TMC Slams BJP : బీజేపీ చేపట్టిన ఛలో సచివాలయం కార్యక్రమం రణరంగంగా మారింది. పోలీసులు కార్యకర్తలు, నాయకుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా గాయపడిన వారిని , మద్దతుదారులను కలిసేందుకు ఐదుగురు సభ్యల బీజేపీ ప్రతినిధి బృందం కోల్ కతాకు చేరుకుంది.
పోలీసుల చర్యపై ఈ బృందం తన నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించనుంది. రాష్ట్ర సర్కార్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
పార్టీ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ సందర్బంగా పశ్చిమ బెంగాల్ లో జంగిల్ రాజ్ (అడవి పాలన) సాగుతోందంటూ సంచలన ఆరోపణలు చేసింది బీజేపీ టీం.
అయితే బీజేపీ బృందం చేసిన కామెంట్స్ పై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC Slams BJP) నిప్పులు చెరిగింది. కులం, మతం, ప్రాంతం పేరుతో మత విద్వేషాలను రాజేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపించింది.
లేని దానిని భూతద్దంలో చూపెట్టేందుకే యత్నిస్తోందంటూ ధ్వజమెత్తింది. ఇదే సమయంలో బీజేపీ నాయకుల బృందాన్ని పొలిటికల్ టూరిస్టులంటూ సంచలన ఆరోపణలు చేసింది టీఎంసీ.
రాజ్యసభ ఎంపీ బ్రిజ్ లాల్ , కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ తో కూడిన ఐదుగురు సభ్యుల బృందం కార్యకర్తలు చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించింది.
ఎంపీ సమీర్ ఓరాన్ , ఎంపీ అపరాజిత సారంగి, సునీల్ జాఖర్ లు ఈ టీంలో సభ్యులుగా ఉన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా బీజేపీ ఆటలు పశ్చిమ బెంగాల్ లో చెల్లవని స్పష్టం చేసింది టీఎంసీ.
Also Read : పీకే స్ట్రాటజిస్ట్ కాదు పక్కా వ్యాపారవేత్త